రాష్ట్రీయం

గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: వచ్చేనెల ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 68 మున్సిపాల్టీలతో పాటు పదవీకాలం ముగిసిన 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరి నియమానికి సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కలక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ పంచాయతీలకు, మున్సిపాల్టీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై మంగళవారం సచివాలయంలో కలక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రస్తుతం ఉన్న 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇంచార్జీలుగా పంచాయతీ కార్యదర్శులను నియమించాలని సిఎస్ సూచించారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న మున్సిపాల్టీలకు సంబంధిత తహశీల్దార్లను కమిషనర్లుగా నియమించి స్పెషల్ ఆఫీసర్లుగా రెవిన్యూ డివిజన్ అధికారులను నియమించే ప్రతిపాదనలను రూపొందించి రెండు రోజుల్లో మున్సిపల్ కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాలని సిఎస్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి జిల్లా స్పెషల్ ఆఫీసర్లు, కమిషనర్లను నియామకానికి కలక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలు కలిగి ఉంటే దానికి కనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు పంపించాలన్నారు. గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకున్న మినిట్స్ బుక్స్‌ను సీజ్ చేసి, కొత్త మినిట్ బుక్స్‌ను తెరవాలన్నారు. కొత్త మున్సిపాల్టీలకు ప్రస్తుతం ఉన్న బ్యాంక్ ఖాతాలను మూసివేసి కొత్త అకౌంట్లను తెరవాలన్నారు. మున్సిపాల్టీల ద్వారా చేపట్టే పనులపై కలక్టర్లు ప్రత్యేకంగా కమిషనర్లతో చర్చించాక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే మున్సిపాల్టీలలో ప్రధాన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, ముఖ్యమైన కూడళ్లలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. భూ సేకరణ ప్రకటనను సమాచారశాఖ ద్వారానే జారీ చేయాలన్నారు. అయితే కొంత మంది కలక్టర్లు నేరుగా భూ సేకరణ ప్రకటనలు జారీ చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించిన బకాయిలు రూ.37 కోట్లను వెంటనే చెల్లించాలని అరవింద్‌కుమార్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ, నూతన గ్రామ పంచాయతీలను క్లస్టర్లకు కలపాలని సూచించారు.