రాష్ట్రీయం

దర్శనం నిలిపివేత తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేనెలలో జరిగే మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులు భక్తులకు దర్శనం నిలిపివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంప్రోక్షణ జరిగినన్ని రోజులు కొండపైకి భక్తులకు అనుమతించేదిలేదని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి సచివాలయంలో టీటీడీ, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి నిత్యపూజా నైవేద్యాలు సమర్పించాల్సి ఉందని తెలుసుకుని పూజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో అయినా దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆదేశించారు. గతంలో మహాసంప్రోక్షణ సందర్భంగా పాటించిన నియమాలనే ప్రస్తుతం అమలు చేయాలన్నారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని టీటీడీ అధికారులను హెచ్చరించారు. సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, సంప్రోక్షణ సమయంలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నిబంధనలు రూపొందించాలన్నారు. అవసరమైతే పండితులతో చర్చించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.