రాష్ట్రీయం

ప్రజలు తిరగబడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు సమీపంలో ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని రోడ్ల దుస్థితి, తదితర సమస్యలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు బుధవారం నగర కాంగ్రె స్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు ప్రధాన రోడ్డుపైనే అరెస్టు చేశారు. అంజన్‌కుమార్ యాదవ్‌ను, దేప భాస్కర్ రెడ్డి ఇంకా కొంత మంది నగర నాయకులను పోలీసులు నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తదితరులు అక్కడికి చేరుకుని, పోలీసు స్టేషన్లో ఉన్న నేతలను కలుసుకున్నారు.అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి బాగా లేదని కమిషనర్‌కు చెప్పేందుకు వెళితే కూడా పోలీసులు అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, డల్లాస్‌లా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేవలం సీఎం క్యాంపు కార్యాలయం వద్దే రోడ్లు బాగున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా నియంతృత్వ ధోరణిని అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని విమర్శించారు. రోడ్లు బాగాలేకపోవడంతో ఆటోలో వెళుతున్న గర్భిణి మహిళకు ప్రసవం అయినట్లు తాను విన్నానని ఆయన చెప్పారు. అంజన్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరం గుంతలమయం అయ్యిందని విమర్శించారు. నిరసన తెలిపేందుకు వెళుతున్న తమను పోలీసులు అరెస్టు చేశారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పారు.