రాష్ట్రీయం

వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు 22న బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య’ అవార్డు-2018’ కు ప్రముఖ కవి వజ్జల శివకుమార్ ఎంపిక య్యారు. సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన అవార్డు ఎంపిక కమిటీ ఈ నెల 11న సమావేశమై వజ్జల పేరును ఖరారు చేసింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ నెల 22న ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందిస్తారు. అవార్డు కింద 1,01,116 రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, శాలువను అందచేస్తారు. ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది. వజ్జల శివకుమార్ రాజన్న సిర్సిల్లా జిల్లా (గతంలో కరీంనగర్ జిల్లా) వేములవాడలో 1956 ఆగస్టు 3న జన్మించారు. వజ్జల సాంబశివశర్మ, రాధాబాయి ఆయన తల్లిదండ్రులు. 12 సంవత్సరాల వయస్సులోనే వేములవాడలో మిత్రులతో కలిసి సాహిత్యరంగ ప్రవేశం చేశారు. చొప్పకట్ల చంద్రవౌళి, కేశన్నగారి రాజశర్మ, మధు మృత్యుంజయ శర్మ వీరికి గురువులు. డాక్టర్ సీ. నారాయణరెడ్డి సాహిత్యోత్సవం సందర్భంగా వేములవాడలో 1976 లో జరిగిన కవి సమ్మేళనంలో బాలకవిగా కవితను వినిపించి, సినారేతోపాటు మహాకవి దాశరథి ఆశీస్సులు అందుకున్నారు. 1969లో కామారెడ్డి, కరీంనగర్‌లలో మిత్రులు వారాల ఆనంద్, జింబో, పీఎస్ రవీంద్రలతో కలిసి సాహితీ సంస్థలను ఏర్పాటు చేశారు. సాహితీ మిత్రులతో కలిసి ‘లయ’ సంకలనాన్ని వెలువరించారు. శివకుమార్ రాసిన ‘గోగుపువ్వు’, ‘పాలకంకులకల’, ‘దాఖలా’, ‘కలలసాగు’ సంకలనాలు వెలువడ్డాయి. గోగుపువ్వుకు కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. పాలకంకుల కలకు సీనారే పురస్కారం, ఇతర పురస్కారాలు లభించాయి. తెలంగాణ రచయితల వేదికతో కదిలి హైదరాబాద్ కేంద్రంగా మిత్రులతో కలిసి తెలంగాణ సాహిత్య సమాఖ్యను స్థాపించారు.