రాష్ట్రీయం

ఇక ‘హైటెక్ వ్యవసాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. సాంప్రదాయ విధానాల స్థానంలో ఆధునిక విధానాలు అమల్లోకి వస్తున్నాయి. వరిపంటకు సంబంధించి నాట్లు వేసే పనిలో మహిళా కూలీలు పనిచేసేవారు. మారిన కాలమాన పరిస్థితిలో కూలీలు దొరకడం ఇబ్బందికరంగా మారింది. దాంతో నాట్లు వేసేందుకు యంత్రాలను ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రైతులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరినాటే యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రతి మండలంలో 10 వరినాటే యంత్రాలను సబ్సిడీపై అందుబాటులో ఉచుతున్నారు. ఒకటి, లేదా రెండు గ్రామాలకు కలిపి ఒక యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఒక ప్రణాళిక ప్రకారం ఈ యంత్రాన్ని ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వరినాటే యంత్రాల పంపిణీ, వినియోగం, రైతులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించేందుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం తన నివాసంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు, వరిపరిశోధనా కేంద్రం శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్, పాలెం, వరంగల్, జగిత్యాల వరిపరిశోధనా కేంద్రాల్లో వరినాటే యంత్రాలను ఏ విధంగా ఉపయోగించాలో ప్రదర్శనకు ఉంచాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వివిధ జిల్లాల్లోని రైతులు వీటిని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.