రాష్ట్రీయం

ఓటింగ్ వరకూ వెళ్లదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్ వరకూ వెళ్లదని టీఆర్‌ఎస్ అంచనా వేస్తున్నది. ఏది ఎలావున్నా, ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రమే అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ అనంతరం ఓటింగ్ జరిగే పక్షంలో ఆచితూచి వ్యవహరించాలని టీఆర్‌ఎస్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. అవిశ్వాసంపై ఓటింగ్ వరకు వెళ్లే అవకాశం ఉండదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈ అంశంపై పార్టీ ఎంపీలతో ఫామ్ హౌస్‌లో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అవిశ్వాసం ఓటింగ్ వరకు వెళ్లకపోవచ్చని ఎంపీలు ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలిసింది. ఒకవేళ ఓటింగ్ జరిగితే, ఏం చేయాలన్నది అప్పుడే నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్టు తెలిసింది. అవిశ్వాసంపై జరిగే చర్చలో విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల పట్ల కేంద్ర ప్రభుత్వం వహిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని టీఆర్‌ఎస్ భావిస్తుంది. హైకోర్టు విభజన, షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపిణీ విభజన, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర ప్రధానమైన అంశాల పట్ల కేంద్ర వైఖరిని నిలదీయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కేంద్ర జల సంఘానికి లేఖ రాయడంతో టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు బహాటంగానే విమర్శిస్తున్నారు. ‘కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రతిపాదిస్తుందో టీడీపీ నేతలు మాకు చెప్పారా?’ అని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ ఢిల్లీలో వ్యాఖ్యనించడంలో ఆంతర్యాన్ని బట్టి మద్దతు ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదన్నది స్పష్టమవుతున్నది. అవిశ్వాసంపై ఓటింగ్‌కు వెళ్లే అవకాశం ఉండదని, చర్చలో మాత్రం పాల్గొని ఓటింగ్‌కు మద్దతుగాగానీ, వ్యతిరేకంగాగానీ వ్యవహరించకుండా గైర్హాజర్ అయ్యే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కావడంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉండి రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడం ఉత్తమమని పార్టీ ముఖ్య నేతలు అధినేతకు సూచించినట్టు తెలిసింది.