రాష్ట్రీయం

20 నుండి తుది దశ ఎంసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో యూజీ కోర్సులో చేరేందుకు ఈ నెల 20వ తేదీ నుండి తుది దశ ఎమ్సెట్ కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్, సీనియర్ ఐఎఎస్ అధికారి నవీన్ మిట్టల్ చెప్పారు. అభ్యర్ధులు 20, 21 తేదీల్లో కనీస సమాచారం ఇవ్వడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలని, 21న సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని, 21వ తేదీ నుండి 23వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని, 23వ తేదీ సాయంత్రం వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. 25వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, సీట్లు పొందిన అభ్యర్థ్ధులు 25 నుండి 27 మధ్య ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు. 25వ తేదీన స్లయిడింగ్ మార్గదర్శకాలను ఇస్తామని నవీన్ మిట్టల్ చెప్పా రు. దానికి అనుగుణంగా అభ్యర్థులు అంతర్గత స్లయిడింగ్‌కు వెళ్లాలని పేర్గొన్నారు. గతంలో సీటు వచ్చి చేరని వారు, సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరైనా సీటు పొందని వారు, గతంలో సర్ట్ఫికెట్ల పరిశీలనకు వెళ్లినా, వెబ్ ఆప్షన్లు నమోదు చేయని వారు, గతంలో సీటు వచ్చినా మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ రిపోర్టు చేయని వారు, ఇతర అర్హులైన వారు కూడా ఈసారి వెబ్ కౌనె్సలింగ్‌కు హాజరుకావాలని ఆయన సూచించారు.