రాష్ట్రీయం

బీజేపీతో పైకి యుద్ధం.. లోపల కాళ్ల బేరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 18: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో బయటకు యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూనే లోపల మాత్రం వారి కాళ్లు మొక్కుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుపడితే చంద్రబాబు వంగిపోతారని, గత నాలుగేళ్ళుగా బీజేపీ వద్ద సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం సాయంత్రం జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంత చెరువు వద్ద బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ కట్టని, కనపడని అమరావతి గురించి చంద్రబాబు సింగపూర్‌లో మాట్లాడతారని, అమరావతి భూముల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు చెందిన గేదెలు మేస్తున్నాయన్నారు. అమరావతి వెళ్ళి చూస్తే బాహుబలి గ్రాఫిక్కులు, బాబు జిమ్మిక్కులు మాత్రమే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో చంద్రబాబుకు ప్రథమ స్థానం ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదని, ఈజ్ ఆఫ్ కరప్షన్ బిజినెస్‌లో ప్రథమ బహుమతినిస్తే సమంజసంగా ఉంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సుమారు రూ.20 లక్షల కోట్లతో పరిశ్రమలు రాగా 40 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయని, విద్యుత్ ధర యూనిట్ రూ.3.75 నుండి రూ.8.75కు పెరగడంతో అనేక పరిశ్రమలు దివాలా తీశాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర సహకార పరిశ్రమలు మూతపడుతున్నాయని,
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 50 స్పిన్నింగ్ మిల్లులకు గాను 10 మిల్లులు మూతపడ్డాయన్నారు. విజయనగరం జిల్లాలో 14 జూట్ మిల్లులు దివాలా తీశాయన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ అడ్డదారుల్లో లాభాలు గడిస్తుంటే, రాష్ట్రంలో సహకార డెయిరీలు చిక్కుల్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి, మోసం చేసినందుకు ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వవచ్చని, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, ప్రత్యేక హోదా అంశాల్లో ప్రజలను మోసం చేసినందుకు చంద్రబాబుకు ప్రథమ స్థానం ఇవ్వవచ్చన్నారు. నాలుగేళ్ళ పాటు బీజేపీతో కలసి కాపురంచేసి నేడు విడిపోయినట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండుచేస్తూ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారని, తమ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలూ రాజీనామా చేసుంటే మనకు ప్రత్యేక హోదా ఇచ్చేవారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భర్త చంద్రబాబుకు సలహాదారుగా ఉంటారని, బీజేపీకి చెందిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఉంటారని, బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎద్దేవాచేశారు. బీజేపీతో టీడీపీకున్న సంబంధాలను చూస్తే చిత్రంగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు బహిరంగ సభలో పాల్గొన్నారు.