రాష్ట్రీయం

పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 18: గోదావరి నదిలో వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భద్రాచలం వద్ద ఉద్ధృతి కొనసాగినా రాత్రి సమయానికి నిలకడగా మారింది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలోని ప్రధానంగా కొయిదా, భద్రాచలం వద్ద వరద నీటి ప్రవాహ మట్టాన్ని బట్టి ధవళేశ్వరంలోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద రిజర్వాయర్ మట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ గేట్లను ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెడుతుంటారు. కొయిదా వద్ద ఉదయం 15.08 మీటర్ల మట్టం నమోదు కాగా అది కాస్తా సాయంత్రానికి 17 మీటర్లకు పెరిగింది. భద్రాచలం వద్ద ఉదయం 32.70 అడుగుల నుంచి సాయంత్రానికి 32.50 అడుగులకు చేరుకుని నిలకడగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం వద్ద 7.65 మీటర్లు, పేరూరు వద్ద 10.02, దుమ్ముగూడెం వద్ద 9.54, కూనవరం వద్ద 11.64, కుంట వద్ద 6.80, పోలవరం వద్ద 9.75 మీటర్లు నమోదైంది. కాటన్ బ్యారేజి వద్ద 12.93 మీటర్ల పాండ్ లెవెల్‌ను నిర్వహిస్తున్నప్పటికీ రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 14.48 మీటర్ల మట్టం నమోదై ఘాట్లలో జలాలు మెట్ల పైభాగంలో ప్రవహిస్తున్నాయి.
కాటన్ బ్యారేజి మొత్తం నాలుగు ఆర్మ్‌లలోని 175 గేట్లను 1.2 మీటర్ల మేరకు ఎత్తివేసి వచ్చిన జలాలను వచ్చినట్టుగా సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. బ్యారేజి వద్ద 7.14 అడుగుల ప్రవాహ మట్టం నమోదైంది. 3 లక్షల 89వేల 749 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. తూర్పు డెల్టాకు 1800 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1700 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 2500 క్యూసెక్కుల జలాలను సాగునీటి కాల్వలకు విడిచి పెడుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం నుంచి కేవలం రెండు పంపులను ఆన్ చేసి 708 క్యూసెక్కుల జలాలను మాత్రమే కృష్ణాకు తోడుతున్నారు. బ్యారేజి వద్ద ఉదయం 2 లక్షల 3వేల క్యూసెక్కులు డిశ్చార్జి చేయగా అది కాస్తా సాయంత్రానికి 3 లక్షల 89వేల క్యూసెక్కులకు పెరిగింది.