రాష్ట్రీయం

నిండిన తుంగభద్ర 12 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూలై 18: కర్నాటక, ఆంధ్ర రైతులకు జీవనాడిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండింది. దీంతో బుధవారం జలాశయం గేట్లు ఎత్తారు. 12 గేట్లను సుమారు అడుగు మేర ఎత్తి దిగువ నదిలోకి 10 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1630.04 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.08 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 98.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 67,140 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. భారీ ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని జలాశయం గేట్లు ఎత్తాలని తుంగభద్ర బోర్డు అధికారులు నిర్ణయించారు. దీంతో బుధవారం సాయంత్రం తుంగభద్ర బోర్డు చైర్మన్ రంగారెడ్డి, ఎస్‌ఈ కె.వెంకటరమణ, ఎల్‌ఎల్‌సీ ఈఈ విశ్వనాథరెడ్డి, హెచ్‌ఎల్‌సీ ఇంచార్జి ఈఈ రమేష్ జలాశయంలో తుంగభద్రమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం క్రష్ట్‌గేట్లకు పూజలు చేసి పైకి ఎత్తారు. దీంతో దిగువ నదిలోకి తుంగభద్ర జలాలు పరుగులు తీశాయి. తుంగభద్ర నదికి వరద నీరు విడుదల చేయడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గత పదేళ్లలో జూలై నెలలోనే జలాశయం నిండడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.