రాష్ట్రీయం

దర్శన విధానంపై సూచనలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 18: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వచ్చేనెల్లో జరుగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో అనుసరించాల్సిన దర్శన విధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో 17న మంగళవారం టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్‌యాదవ్‌తో కలిసి ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు భక్తులకు ఏ విధంగా దర్శనం కల్పించాలన్న విషయమై భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి భక్తులు తమ విలువైన సూచనలు, సలహాలను ఈనెల 23వ తేదీ మధ్యాహ్నంలోపు ఈ కింది నెంబర్లకు తెలియజేయాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు - 0877-2233333, 2277777. వాట్సాప్ నెంబర్ - 9399399399, టోల్‌ఫ్రీ నెంబర్లు-18004254141, 1800425333333, ఇ-మెయిల్ : హెల్ప్‌డెస్క్- అట్‌దిరేట్‌ఆఫ్‌తిరుమల.ఓఆర్‌జీ