రాష్ట్రీయం

‘ప్రాణహిత’ కథ కంచికి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 18: దశాబ్దకాలంగా అందరినోట నానుతూ వస్తున్న ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కథ ఇక కంచికి చేరినట్టే. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబర్‌లో పూర్వ ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్టుకు అట్టహాసంగా శంకుస్థాపన చేయగా అప్పట్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు 38వేల కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాణహితకు బదులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకురావడంతో ప్రాణహితపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకోసం తుమ్మడిహెట్టి వద్ద రూ.1919 కోట్ల వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేపట్టడం, ఇందుకోసం 107 గేట్లు నిర్మించాలని అప్పట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. దీనికి బదులుగా ప్రాణహిత సమీపంలోని 200 మీటర్ల ఎగువన వైన్‌గంగా కలిసేచోట వార్దా నదిపై బ్యారేజీ నిర్మించి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్‌టి, ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాల ఆయకట్టు అందించాలని సాగునీటి నిపుణులు సూచించడంతో ప్రభుత్వం ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే, డీపీఆర్‌కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌కు బాధ్యతలు అప్పజెప్పింది. ఇటీవల నిర్వహించిన రాడార్ సర్వేలో 64 టీఎంసీల నీటి లభ్యత ఉన్న వార్దా బ్యారేజీ ద్వారా ఉమ్మడి జిల్లాకు 20 టీఎంసీల నీటి అవసరం మేరకు 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే గతంలో 1,919 కోట్లతో అంచనాలు రూపొందించారు. డిజైన్ మారడంతో కొత్తగా వార్దానదిపై నిర్మించే బ్యారేజీ వల్ల 109 గేట్లకు బదులుగా 36 గేట్లు మాత్రమే నిర్మిస్తే సరిపోతుంది. దీంతో ముంపు భాగం తగ్గడమే గాక పర్యావరణ క్లియరెన్స్ కూడా లభిస్తుంది. ఈ మేరకు తుమ్మడిహెట్టి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని మార్చి వార్దా నది వద్ద ప్రవహించే నీటిలభ్యతకు అనుకూలంగా డిజైన్ మార్చి 20 టీఎంసీల అవసరాలను వినియోగించుకొని 2లక్షల ఎకరాల ఆయకట్టు కోసం రూ.600 కోట్లు ఖర్చుచేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణహితకు ప్రత్యామ్నాయంగా వార్దావద్ద నిర్మించే బ్యారేజీతో రూ.1,300 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సర్వే రిపోర్టుతో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, వార్దా వద్ద బ్యారేజీ నిర్మిస్తే గోదావరి నది అనుసంధానమయ్యే గ్రావిటీ కాలువకు గండికొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని, ప్రభుత్వం ప్రాణహితను విస్మరించడం వల్ల వార్దా బ్యారేజీతో 2 లక్షల ఎకరాలకు సాగునీరందడం కష్టమని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆక్షేపిస్తున్నాయి. కొత్త బ్యారేజీని అడ్డుకొని తీరుతామని ప్రాణహిత జల సాధన సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు.
అపోహలు వద్దు: ఎస్‌ఈ విష్ణు ప్రసాద్
ప్రాణహితకు బదులు వార్దానదిపై బ్యారేజీ నిర్మిస్తే ఎలాంటి నష్టం లేదని ప్రాణహిత ప్రాజెక్టు ఎస్‌ఈ విష్ణు ప్రసాద్, ఈఈ సత్యవర్ధన్ తెలిపారు. జల వనరుల అభిప్రాయం మేరకే ఈ ప్రాంతానికి అవసరమయ్యే 20 టీఎంసీలు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దీనిపై అపోహలు విడనాడాలని అన్నారు.