రాష్ట్రీయం

సత్రాగచ్ సూపర్‌ఫాస్ట్ రైలు బోగీలో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూలై 19: విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెడుతున్న సత్రాగఛ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ నుండి పొగలు రావడంతో గురువారం రాత్రి 20 నిమిషాలపాటు సామర్లకోట రైల్వేస్టేషన్‌లో ఆగిపోయింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గౌతమీ ఎక్స్‌ప్రెస్ రైలు ముందు వెళ్ళడంతో గురువారం రాత్రి 7.40 నిమిషాలకు సత్రాగఛ్- తిరువనంతపురం (ట్రైన్ నెంబర్ 12156) వెడుతుండగా సామర్లకోటలో హాల్టులేని ఈ రైలును రెండో నెంబర్ ప్లాట్‌ఫాంపై క్రాసింగ్ కోసం నిలుపుదల చేశారు. అదే సమయంలో ఎస్ 7 నెంబర్ బోగీ నుండి భారీగా పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురై బయట ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు. అప్పటికే రైలు బోగీ బ్యాటరీ బాక్స్ నుండి పొగలు బాగా రావడంతో, స్థానిక రైల్వే అధికారులు, సిబ్బంది బోగి వద్దకు చేరుకుని పొగలు అరికట్టారు. పూర్తి మరమ్మతులకు రాజమండ్రిలో ఆగాలని ట్రైన్ డ్రైవర్‌కు సూచించి ముందుకు పంపించారు. రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ట్రైన్ సామర్లకోట నుండి బయలుదేరింది. సుమారు 25 నిమిషాలు ఈ సంఘటనతో రైలు సామర్లకోటలో ఆగింది. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ శాస్ర్తీ, ఆర్పీఎఫ్ ఎస్సై సురేష్ గౌడ్, సిబ్బంది, ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.