రాష్ట్రీయం

నేటి నుంచి లారీల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: రవాణా రంగ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే లారీల నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్‌లో రంగం సిద్ధమైంది. అనాది నుంచి కూడా రవాణా రంగంలో ఆంధ్రప్రదేశ్, అందునా కృష్ణా జిల్లా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏపీలో భారీ ట్రక్కులు, లారీలు, ట్యాంకర్లు అన్నీ కలిపి దాదాపు 3లక్షల 20 వేలకు పైగా ఉంటే ఒక్క కృష్ణా జిల్లాలోనే 40వేల వరకు ఉన్నాయి. అందుకని కొద్దిరోజులుగా లారీల నిరవధిక సమ్మెపై కృష్ణాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా వీరికి సంఘీభావంగా ఆయిల్ డీలర్లు ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఈ సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చేలా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గురువారం రాత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. లారీలు, ట్యాంకర్ల సమ్మె వల్ల పెట్రోలు, డీజిల్ కొరత వస్తుందనే భయంతో ద్విచక్ర వాహనచోదకులు, ప్రైవేట్ రవాణా వాహనాలు, ముఖ్యంగా జీపులు, ఆటోలు, ప్రైవేట్ బస్సుల యజమానులు ముందజాగ్రత్తగా డీజిల్‌ను నిలువ చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో సాయంత్రం నుంచి రాష్టవ్య్రాప్తంగా అన్ని పెట్రోలు బంకుల వద్ద క్రమేణా రద్దీ పెరిగింది. ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపుమేరకు అన్నిరకాల వాహనాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆంధ్ర లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోనేరు వెంకట రామారావు, అడుసుమిల్లి సదాశివరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల గురించి వారు వివరిస్తూ డీజిల్ రేటు తగ్గించి ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించి దేశవ్యాప్తంగా ఒకే రేటు ఉండేట్టు చేయాలన్నారు. టోల్ చెల్లింపు విధానం మార్పుచేసి సరళతరం చేయాలని, ప్రతి ఏటా పెంచుతున్న థర్డ్ పార్టీ బీమా విధానాన్ని మార్పు చేయాలని, ఆదాయపు పన్ను సెక్షన్ 44 ఏఈ, టీడీఎస్ మినహాయింపు రద్దు చేయాలని, ఈ-వేబిల్లుల సమస్యలు పరిష్కరించాలని, లారీల తరహాలో బస్సులు, టూరిస్ట్ వాహనాలకు నేషనల్ పర్మిట్లు జారీ చేయాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ విధానం తొలగించాలని, ఆంధ్రప్రదేశ్ వరకు డీజిల్‌పై పెంచిన రూ. 4 పన్నును తక్షణం తగ్గించాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ఇసుక, సిమెంట్ లోడు లారీలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భవన నిర్మాణ యజమానులు, బిల్డర్లు ప్రధానంగా లక్షలాది మంది కార్మికులు అప్పుడే తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అలాగే నిత్యావసర సరుకుల రవాణా నిలిచి వాటి ధరలు పెరుగుతాయని కూడా ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో బ్లాక్ మార్కెట్ కట్టడికి అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.