రాష్ట్రీయం

సిద్ధవౌతున్న ఎన్నికల వాహనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 19: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ప్రచార వాహనాల తయారీకి విజయలక్ష్మి డిజైనర్స్ శ్రీకారం చుట్టింది. నేతలు ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రత్యేకంగా ప్రచార వాహనాల తయారీని ప్రారంభించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు తమకు ప్రచార వాహనాలను తయారుచేసి ఇవ్వాల్సిందిగా ఆర్డర్లు ఇవ్వగా, వాహనాలను కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు తమకు నచ్చిన డిజైన్లలో వాహనాలు తయారుచేసి అందించాలని సంస్థను కోరారు. గతంలో మహింద్రా కంపెనీకి చెందిన వాహనాలను వినియోగించినప్పటికీ ప్రస్తుతం నెల్లూరు జిల్లా శ్రీసిటీ నుండి తయారైన జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఇసుజు వాహనాలను ప్రచార వాహనాలుగా తీర్చిదిద్దుతున్నారు. సొంత రాష్ట్రంలో కార్లు తయారు కావడం, కొన్ని రకాల పన్నుల మినహాయింపు అవకాశం లభించటంతో వాహనాల ధరలు అందుబాటులోకి రావటం వల్ల ఏపీ, తెలంగాణ నేతలు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన మంత్రులు నారా లోకేష్, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, వైసీపీకి చెందిన జోగి రమేష్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పీవీఎల్ నరసింహారావుకు చెందిన వాహనాలు సిద్ధమయ్యాయి. తెలంగాణకు సంబంధించి టీఆర్‌ఎస్ నేతలు పి హరీష్, ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డిలకు చెందిన వాహనాలు డెలివరీ ఇవ్వటానికి సిద్ధమయ్యాయి. ఆయా పార్టీలకు చెందిన రంగులు, గుర్తులు, ప్రధాన నేతల ఫొటోలతో ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు సాంకేతికపరంగా కూడా తీర్చిదిద్దారు. ఆయా అంశాలపై జయలక్ష్మి డిజైనర్స్ ప్రతినిధి నారయ్య చౌదరి, ఇసుజు కంపెనీ ఏపీ, తెలంగాణ ఏరియా మేనేజర్‌లు పద్మదాసన్, సందీప్ మాట్లాడుతూ ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇసుజు కంపెనీకి చెందిన 65 ఎన్నికల ప్రచార రథాలను అందించామని తెలిపారు. అక్కడ విజయవంతం కావడంతో రెండు తెలుగురాష్ట్రాలకు గుంటూరు నుంచే తయారుచేసి అందిస్తున్నట్టు వారు వివరించారు.