రాష్ట్రీయం

బెట్టు వీడిన జేసీ.. ఢిల్లీకి పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 19: ఎట్టకేలకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బెట్టువీడారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానని, పార్టీ విప్‌ను పట్టించుకోనని బుధవారం దివాకర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నేతలు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కలిసి నిర్ణయం మార్చుకోవాలని కోరారు. నగరంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు రూ.60 కోట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగమేఘాలపై జీవో చేశారు. దీంతో దివాకర్‌రెడ్డి ఓ మెట్టు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జేసీ దివాకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. దీంతో మెత్తబడిన దివాకర్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే...: బీజేపీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తూ వారి అజెండాను తెలుగుదేశం పార్టీ అమలుచేస్తోందని ఏపీ బీజేపీ ఢిల్లీ సమన్వయకర్త రఘురాం పరిఘళ్ల ఆరోపించారు. రఘురాం గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఏన్డీయేకు లోక్‌సభలో స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిసి కూడా టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక అజెండా పెట్టుకోని తెలుగుదేశం పార్టీ సభ్యులను ముందు పెట్టి అవిశ్వాసమనే డ్రామాకు తెరలేపినట్టు ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ పొత్తువల్లే తెలుగదేశం పార్టీకి ప్రజలు పట్టంకట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.
మద్దతు ఇవ్వండి: టీడీపీ
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను తెలుగుదేశం ఎంపీలు కోరారు. విభజన హామీలపై అమలు, కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందంటూ వివిధ భాషాలలో టీడీపీ ముద్రించిన బుక్‌లెట్‌లను బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎంపీలకు అందజేశారు. గురువారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తెలుగుదేశం ఎంపీలు సమావేశం అయ్యారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీనికి కలిసిన అవిశ్వాసానికి మద్దతు కోరారు. అలాగే బిజూ జనతాదల్, ఎన్‌సీపీ, సీపీఐ, శివసేన తదితర పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరారు.