రాష్ట్రీయం

తరలివస్తున్న తుంగభద్ర శ్రీశైలానికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటోంది. కృష్ణానది నుంచి వస్తున్న వరద జలాలు జలాశయానికి చేరుకోగా తుంగభద్ర నుంచి శుక్రవారం ఉదయానికి రానున్నాయి. గత ఏడాది జూలై చివరి వారంలో శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక ప్రారంభం కాగా ఈ ఏడాది రెండు వారాలు ముందుగానే రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా గురువారం రాత్రి 800.30 అడుగులుగా నమోదైంది. జలాశయానికి జూరాల నుంచి సగటున 31వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 64 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.
తుంగభద్రకు ఇన్‌ఫ్లో 80,864 క్యూసెక్కులు
బళ్ళారి: తుంగభద్ర జలాశయానికి భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో గురువారం మరో 10 గేట్లు ఎత్తారు. బుధవారం సాయంత్రం 12 గేట్లు అడుగు మేర ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీరు దిగువ నదిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లో 80,864 క్యూసెక్కులకు పెరగడంతో గురువారం ఉదయం మరో పది గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 22 గేట్లను రెండు అడుగుల ఎత్తి 63,118 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.