రాష్ట్రీయం

మంత్రి కేటీఆర్‌ను కలిసిన మళయాళ నటుడు మమ్ముట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి శుక్రవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిసారు. ఈ నెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను మమ్ముట్టి ఆహ్వానించారు. తమ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ప్రాంత మలయాళీ అసొసియేషన్ నిర్వహిస్తున్న స్టార్ట్ అప్స్ ఎంటర్‌ప్య్రినర్ షిప్ అవార్డులను అందించనున్నట్టు కూడా మమ్ముట్టి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తోన్న పంట పెట్టుబడి పథకాన్ని మమ్ముట్టి ప్రశంసించారు. శబరిమలలో తెలంగాణ ప్రభుత్వం కేరళ ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న సహకారాన్ని, అలాగే హైదరాబాద్‌లో మలయాళీలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా మమ్ముటికి మంత్రి వివరించారు.