రాష్ట్రీయం

పోడు భూముల జోలికి వస్తే ఉథ్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: హరితహారం పేరుతో పోడు భూముల జోలికి వస్తే సీపీఎం పార్టీ చూస్తూ ఊరుకోదని, బాధితులతో కలిసి ఉద్యమిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం హెచ్చరించారు. గురువారం ఎంబీ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ హరితహారం పేరుతో ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. అడవులపై ఆధారపడి జీవించే గిరజనులను ఆ ప్రాంతాలను తరిమివేస్తూ కేసీఆర్ చట్టాలను అతిక్రమిస్తున్నారని అన్నారు. గిరిజనులకు రాజ్యాంగ ప్రత్యేక హక్కులు కల్పించినా వాటటిని కాలరాస్తూ అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధుకు పరిమితి విధించాలని 15 ఎకరాలకు మించి ఉన్న భూస్వాములను ఈ పథకం నుంచి మినహాయించాలని అన్నారు. వందలాది, వేలాది ఎకరాలు ఉన్న భూస్వాములకు లబ్దిచేకూరుస్తూ పోడు వ్యవసాయం చేసే వారిపై కక్ష్యసాధింపు చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే పోడు, సాగు రైతులకు రైతుబంధు క్రింద పెట్టుబడి సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక కార్యక్రమాలను మానుకోక పోతే రాష్టవ్య్రాప్త ఆందోళనకు సిద్ధం అవుతామని ప్రకటించారు.