రాష్ట్రీయం

వేగవంతంగా పాలమూరు-రంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. కొన్ని రాజకీయ పక్షాలు కోర్టుల్లో కేసులతో ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయని అన్నారు. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా ఈ ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. జలసౌధలో శుక్రవారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతిపై ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సి) మురళీధర్‌రావుతో కలిసి ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులలో ప్యాకేజీ-1లో 66 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనికిగాను 18 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి అయిందని అధికారులు వివరించారు. ఇదే ప్యాకేజీలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ టనె్నల్ నిర్మాణ పనులు, గ్రావిటీ కెనాల్ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్యాకేజీ పూర్తి అయితే మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు వేసవిలో మంచినీటి ఎద్దడి తీరుతుందన్నారు. ప్రాజెక్టు పరిధిలో అటవీ భూముల సేకరణకు 49 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. ప్యాకేజీ-2లో అంజనాగిరి రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయన్నారు. అయితే రిజర్వాయర్ బండ్ నిర్మాణానికి మట్టి కొరత ఏర్పడిందని ఇంజనీర్లు తెలుపగా రాక్ ఫిల్ డ్యామ్ విధానంలో పనులు చేయడం వల్ల మట్టి సమస్యను అధిగమించవచ్చన్నారు. తెహ్రీ డ్యామ్‌ను ఇదే విధానంలో నిర్మించారని మంత్రి గుర్తు చేసారు. ఆసియాలోనే అతిపెద్ద ర్యాక్ ఫిల్ డ్యామ్ ఇదేనని అన్నారు. కాగా, తాము ఇప్పటికే తెహ్రీ డ్యామ్ ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఇంజనీర్లు తెలిపారు. ప్రాజెక్టు పనుల కోసం డైవర్షన్ రోడ్ల నిర్మాణ పనులను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించాలా? ఆర్‌అండ్‌బీ శాఖతో చేయించాలా? అనే విషయంపై ప్రభుత్వానికి వెంట నే ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్యాకేజీలో ఎలక్ట్రికల్ టవర్స్‌ను మార్చడానికి రూ.18 కోట్లు విడుదలకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇప్పటికే 199 ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద చెల్లింపులు జరిగాయని, మిగతా 110 ఇళ్లకు చెల్లింపులు జరుగలేదని అధికారులు వివరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి చెల్లించాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని భూ సేకరణ ప్రత్యేక అధికారి మనోహర్‌తో చర్చించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-4లో రెండు టనె్నల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఇంజనీర్లు వివరించారు. ఇందులో 15 కిలో మీటర్ల కుడి కాలువకుగాను 7.5 కి.మీ టనె్నల్ పూర్తి అయిందన్నారు. అలాగే ఎడమ కాలువ టనె్నల్‌లో నాలుగు కి.మీ పూర్తి అయిందన్నారు. ముందుగా నీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్న టనె్నల్ పనులపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ-13,14,15 కింద నిర్మాణం అవుతోన్న రిజర్వాయర్ల నాణ్యతలో రాజీ పడవద్దని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి సూచించారు.