రాష్ట్రీయం

నాటు పడవ బోల్తా... మత్స్యకారుడి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 21: తూర్పుగోదావరి జిల్లా పశుపులంక పడవ బోల్తా ఘటన మరవకముందే శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఒక పడవ బోల్తాపడింది. ఎనిమిది మంది మత్స్యకారులతో వెళ్తున్న పడవ సముద్రతీరంలో బోల్తాపడింది. ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ఐదుగురి జాడ తెలియకుండా పోయింది. అయితే గాలింపు చర్యలు మొదలుపెట్టిన మెరైన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నలుగురిని బోల్తాపడిన పడవను పగులగొట్టి రక్షించారు. ఒకరి జాడ తెలియలేదు. సంతబొమ్మాళి మండలం ఉమ్మలాడ తీరంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా పది రోజుల క్రితం పారాదీప్ ప్రాంతానికి అత్యంత ఖరీదైన కోనాం చేప వేట కోసం బయలుదేరారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తిరుగు ప్రయాణంకాగా, ఈ ప్రమాదం జరిగింది. విజయనగరం కలెక్టర్ హరిజవహార్‌లాల్ మత్స్యకారులు తీరంలో చిక్కుకున్న సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డికి అందజేసారు. వెంటనే కలెక్టర్ టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావుతో పాటు ఇతర శాఖల అధికారులను అప్రమత్తం చేసారు. అయితే, బోల్తాపడిన పడవలోనే మత్స్యకారులు ఉండి ఉంటారని భావించిన స్థానిక మత్స్యకారుల ఆలోచనలకు తగ్గట్టుగానే బోటును పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పగులగొట్టారు. దీంతో బర్రి తాతయ్య, పోలోడు, యాగేసు, గోవిందఅప్పన్న ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతు అయిన శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ ధనంజయరెడ్డిని ఆదేశించారు.