రాష్ట్రీయం

అసలు దోషులు ఎవరో తేలిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఆంధ్రప్రదేశ్‌కు అసలైన దోషులు ఎవరో తేలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళామోర్చ నాయకురాలు పురంధ్రీశ్వరి అన్నారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంటులో జరిగిన పరిణామాలపై శనివారం నాడు ఆమె బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదీష్ రాంభొట్లతో కలిసి హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల్లో 80 శాతం ఇప్పటికే నెరవేర్చిందని, ఐదారు అంశాల్లో జాప్యం జరుగుతోందని ఆమె వివరించారు. కేంద్రం జాప్యం చేస్తోందన్న ఆరోపణలు సరికాదని, ఏ ప్రాజెక్టుకు అయినా సంబంధించి వివరణ కోరితే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం సకాలంలో సమాధానం ఇస్తే కేంద్రం జాప్యం అంటూ ఉండదని చెప్పారు. దుగరాజుపట్నంకు ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని ఇస్తే దానిని రెండో తేదీనే ప్రారంభించే వీలుందని అన్నారు. ఏ విద్యాసంస్థకైనా నాలుగైదేళ్లు పడుతుందని, ఆ విద్యాసంస్థకు ఏకమొత్తంలో ఒకే మారు నిధులు సమకూర్చడమనేది ఎపుడూ జరగదని ఆమె ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే అదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ నేత చంద్రబాబునాయుడు అవిశ్వాసం పెట్టారని, పార్లమెంటులో ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మంటకలిపారని అన్నారు.
పార్లమెంటులో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే తీసుకురాలేదని, ఏపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆమె మండిపడ్డారు. అశాస్ర్తియంగా జరిగిన విభజనలో సీఎం చంద్రబాబుకు భాగం ఉందని ఆరోపించారు. ఏపీకి ఏం అడిగినా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌లు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. పార్లమెంటులో బీజేపీపై టీడీపీ అబద్దాలు చెప్పిందని అన్నారు. దుగరాజుపట్నం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, కడప స్టీల్ ప్లాంట్ జాప్యం చంద్రబాబు వల్ల కాదా అని ఆమె ప్రశ్నించారు. విశాఖ రైల్వేజోన్ ఖచ్చితంగా ఇస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్భ్రావృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. చంద్రబాబునాయుడు అబద్దాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు.