రాష్ట్రీయం

ఆంధ్రాకు న్యాయం జరిగేవరకూ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరిగే వరకూ జనసేన తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక రోజు బంద్‌తోనో, కాగడాల ప్రదర్ళనతోనో సరిపెట్టుకోలేమని, ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు నిరంతరాయంగా పోరాటం చేయాల్సిందేనని అన్నారు. జనసేన పార్టీ చేపట్టిన జనసేన పోరాట యాత్ర ఇందులో భాగమేనని చెప్పారు. ప్రతి నియోజకవర్గం కేంద్రం నుండి ప్రజల గళాన్ని, హోదా కోసం ప్రజలు పెంచుకున్న ఆశలు, ఆకాంక్షలను ఈ యాత్రలో వినిపిస్తామని ఆయన పేర్కొన్నారు. పాలక పక్షాలు విభజన సమయంలో ఏ విధంగా వంచించాయో, నాటి చట్టంలో పేర్కొన్న వాటిని అమలుచేయాల్సిన బాధ్యత ఉన్న నేటి పాలకులు ఏ రీతిన అన్యాయం చేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. న్యాయం జరిగే వరకూ జనసేన ముందుకు వెళ్తుందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో పాలన చేస్తున్న వారే విభజన హామీల అమలు విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని, వారి రాజకీయ ప్రయోజనాలకు అనువుగా మాటలు మారుస్తున్నారనేది వాస్తవమని, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో సమానంగా రాష్ట్రంలో ఉన్న టీడీపీ అంతే దారుణంగా రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీసిందని, ప్రజలను రెండు పార్టీలూ మోసం చేశాయని అన్నారు.
రెండు పార్టీలూ వంచించాయని పేర్కొన్నారు. ఒక వైపు టీడీపీ ఎంపీలు బీజేపీని తిడుతూనే మరో వైపు బీజేపీ కాళ్లు మొక్కుతున్నారని ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ ఎపీ సీఎం తమ మిత్రుడేనని నిండు సభలో అన్నారని, దీనిని చూస్తుంటే ముఖ్యమంత్రి చేస్తున్నది ధర్మపోరాటమే అని ఎలా నమ్మగలుగుతామని నిలదీశారు.