రాష్ట్రీయం

ఉగ్రవాదులకు అందితే ముప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: రసాయన పదార్థాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివని, వాటిని మానవహితంగా పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్న తరుణంలో ఉగ్రవాదుల చేతికంది రసాయన ఆయుధాలుగా మారకుండా ముందస్తు భద్రత పాటించాలని పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ ప్రధాన శాస్తవ్రేత్త క్లిఫర్డ్ గ్లంజ్ అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఇండో-యూఎస్ వర్క్‌షాప్ శనివారం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన దాడులు, ఆయుధాల వల్ల మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. రసాయనాలతో ఏ విధంగా విధ్వంసం సృష్టించవచ్చో తీవ్రవాదులు పరిశోధనలు చేస్తుంటారన్నారు. పారిశ్రామిక అవసరాలకోసం నిల్వ చేసుకునే రసాయనాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచాలన్నారు. పరిశ్రమలు రసాయనాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సంస్థకు చెందిన సీనియర్ శాస్తవ్రేత్త కెనె్నత్ ఫెర్గూసన్ మాట్లాడుతూ రసాయన దాడులు జరిగితే ఏ విధంగా అప్రమత్తం కావాలో వివరించారు. దాడులను ముందుగానే గుర్తించగలిగితే ప్రాణ, ఆస్తినష్ట నివారణ సాధ్యపడుతుందన్నారు. రసాయన ఆయుధాల తనిఖీ నిపుణుడు, ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ నాణ్యత ప్రమాణాల అధికారి డాక్టర్ రామ్‌నారాయణ్ మాట్లాడుతూ రసాయన పరిశ్రలు పరిగే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రమాదకర రసాయనాలను ఉద్దేశపూర్వకంగా వాతావరణంలోకి విడిచిపెట్టి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలపై చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో జరిపే దాడుల్లో రసాయన దాడులకూ తెగబడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయన్నారు. దీనిపై ప్రజలు, పరిశ్రమలను అప్రమత్తం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు అవసరమన్నారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్ నేషనల్ లేబొరేటరీ శాస్తవ్రేత్త డాక్టర్ రాధాకిషన్ మోతుకూరి మాట్లాడుతూ రసాయన దాడులు జరిగిన సమయంలో నష్టనివారణ చర్యలు, రక్షణ వ్యూహాలను వివరించారు. అంతర్జాతీయంగా రూపొందించిన హెల్త్‌కోడ్ నంబర్ సహకారంతో రసాయన దాడుల సమయంలో ఏ విధమైన భద్రత చర్యలు పాటించవచ్చో తెలుస్తుందన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్తవ్రేత్త జీవీ మాధవ శర్మ మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పత్తుల రంగం ఉత్తర అమెరికా నుంచి యూరోపియన్ దేశాలకు అక్కడి నుంచి ఆసియా, ఆసియా పసిఫిక్ దేశాలకు విస్తరిస్తోందన్నారు. జాతీయం, అంతర్జాతీయంగా పరిశ్రమలకు అవసరమైన రసాయనాల రవాణ విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. కార్యక్రమంలో గీతం యూజీసీ వ్యవహారాల డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ రామకృష్ణ, పలు దేశాల నిపుణులు పాల్గొన్నారు.