రాష్ట్రీయం

జలవిద్యుత్ రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: రాష్ట్రంలో రానున్నకాలంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు అనుగుణంగా విద్యుత్ అవసరాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆదివారం ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ 2022 నాటికి జలవిద్యుత్ రెట్టింపు కావాలని నిర్దేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. రూ. 5339 కోట్ల వ్యయ అంచనాలతో చేపడుతున్న పోలవరం జలవిద్యుత్ కేంద్రాన్ని మే 2023కల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జల విద్యుదుత్పాదన రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 2336 మిలియన్ యూనిట్లుగా ఉన్న జలవిద్యుత్ 2022 నాటికి 4600 మిలియన్ యూనిట్లకు చేరనుందన్నారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుని 960 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ స్థాపిత సామర్థ్యం 18వేల 38 మెగావాట్లు ఉండగా, ఇందులో ఏపీ జెన్కో 5వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగి ఉంది. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈపీసీ పద్ధతిలో పోలవరం ప్రాజెక్టు పనులకు
లెటర్ ఆఫ్ ఇండెంట్ సమర్పించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పీక్‌లోడ్ డిమాండ్ తట్టుకునేందుకు పోలవరం జలవిద్యుత్ ఉపకరిస్తుందని చెప్పారు. గత మూడేళ్లుగా రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధిస్తోందని, సగటున 10.96 శాతం వృద్ధి నమోదవుతోందని చెప్పారు. ఇది జాతీయ వృద్ధి (7.31 శాతం) కంటే అధికమని పోల్చిచెప్పారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సుస్థిర విధానంలో పెంచాలని ఇంధన వనరుల శాఖ మంత్రి కళా వెంకట్రావుకు సూచించారు. ఇప్పటివరకు మూడుసార్లు ఏపీ జెన్కో ఉన్నతాధికారులు, నిపుణులతో చర్చించామని, విద్యుదుత్పత్తి సామర్థ్యం, డిమాండ్ మేరకు సరఫరా పెంచేందుకు సంస్థాగతంగా అనేక చర్యలు చేపట్టామని మంత్రి కళా వెంకట్రావు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రత్యేకించి పోలవరం జలవిద్యుత్ కేంద్రం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అన్ని విద్యుత్ కేంద్రాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు ఆదేశించారు. ఏపీ జెన్కోను దేశంలోనే నెంబర్ వన్ పభుత్వరంగ విద్యుదుత్పాదన సంస్థగా తీర్చిదిద్దాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ జెన్కో సీఎండీ కె విజయానంద్‌లకు సూచించారు. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం విద్యుత్ కేంద్రం రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణకు దక్కిందని, అలాంటి ప్రాజెక్టునే సీలేరులో అభివృద్ధి చేసే అవకాశాన్ని పరిశీలించాలని జెన్కో సీఎండీ విజయానంద్‌కు సూచించారు. ఈసందర్భంగా జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి విజయానంద్ విశదీకరించారు.