రాష్ట్రీయం

బాధ్యత లేని పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవటంలో అధికారపక్ష తెలుగుదేశంతో పాటు ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఒక పార్టీని ద్వేషించాలని కాని, మరో పార్టీని ప్రశంసించాలనే ఆలోచన తనకు లేదన్నారు. అయితే సమజానికి చెడు జరుగుతుందంటే గొంతు వినిపించాలన్నదే తన అభిమతమన్నారు. రాజకీయ నేతలు వాస్తవాలను బయటకు పొక్కనీయకుండా తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. రాష్ట్రం విడిపోబోతోందని తెలుస్తున్నా ఏఒక్కరూ ఈ రాష్ట్రానికి ఏమికావాలో నోరెత్తి అడగలేదన్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి వర్గం నుంచి వెలుపలకు వచ్చిన పురంధ్రీశ్వరి, తాను విజయవాడలో పలువురు మేధావులను కలిసి ఏమికావాలని కోరితే
నోరు మెదపకపోగా తమ దిష్టిబొమ్మలను తగులబెట్టించారని గుర్తుచేశారు. అయినా కొందరి జోక్యం వల్లనే విభజన చట్టంలో పది జాతీయ విద్యాసంస్థలు, ఉక్కు ఫ్యాక్టరీ, ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ వంటి అంశాలు చోటుచేసుకున్నాయన్నారు. కేంద్రంపై అవిశ్వాసం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ప్రధానంగా మీడియాలో హైలెట్ కావటం కోసమే పోటీబడుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్ ఉచ్చులో బాబు చిక్కున్నాడంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, అలాగే జగన్ కూడా మీడియా ఉచ్చులో చిక్కున్నాడన్నారు. అందుకే ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు సమాజంలో మేధావులతో కలిసి ఓ నాన్ పొలిటికల్ ఫోరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏ ఒక్క రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా, లేక పొడిగింపు వంటివి చేయలేదన్నారు. పైగా తమ ఆదాయంలో రాష్ట్రాల వాటాను 43శాతానికి పెంచిందని చెప్పారు. ప్రత్యేక జీవో కింద 11 రాష్ట్రాల్లో భారీగా నెలకొల్పిన పరిశ్రమల మనుగడ కోసం నిర్ణీత కాలంపాటు రాయితీల కొనసాగింపునకు కేంద్రం తన బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. హోదాలో ఎక్కడా కూడా కేంద్రం పథకాల అమల్లో 90శాతం కేంద్రం ఖర్చు మినహా పరిశ్రమలకు రాయితీ అనే పదం లేదన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద చెన్నై-విశాఖ కారిడార్ అభివృద్ధి కోసం భూసేకరణ జరిపి వౌలిక సదుపాయాలు కల్పిస్తే కేంద్రం నుంచి భారీగా సహాయం అందుతుందన్నారు. అలాగే ఏ రాష్ట్రానికీ లేనివిధంగా ఏడున్నర లక్షల గృహాలు ఏపీకి మంజూరయ్యాయన్నారు. దుగరాజపట్నంలో ఓడరేవుకు సాంకేతిక అవరోధాలుంటే ప్రత్యామ్నాయం చూపాలి కదా అన్నారు. నాడు ప్యాకేజికి అంగీకరించి నిధులు రాబట్టకుండా నేడు తిరిగి సాధ్యంకాని హోదా కోసం ఉద్యమించడంలో ఆంతర్యం ఏమిటని దగ్గుబాటి సూటిగా ప్రశ్నించారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న దగ్గుబాటి