రాష్ట్రీయం

కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ద్వారా వస్తున్న వరద యథాతథంగా జూరాల ప్రాజెక్టులోకి వస్తోంది. దాదాపు 1.85 లక్షల క్యూసెక్కుల వరద అధికార వర్గాల సమాచారం. దీంతో రెండు రోజుల నుండి జూరాల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తివేసి దిగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని నిరంతరాయంగా వదులుతున్నారు. కర్ణాటక నుండి వస్తున్న వరద ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో పాలమూరు జిల్లాలో కృష్ణానది పరవళ్లు తొక్కుతూ నిండుకుండలా ప్రవహిస్తుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు దేవసూగూర్, తెలంగాణలోకి కృష్ణానది అడుగుపెట్టే మహబూబ్‌నగర్ జిల్లా తంగిడి దగ్గర కృష్ణా బ్రిడ్జిని ఆనుకుని నదీ ప్రవాహం ఉంది. ఈ రెండు ప్రాంతాలలో నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. కొద్దిగా నది ఉగ్రరూపం తగ్గాకే సందర్శకులను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం అయా మండలాల తహశీల్దార్లను ఆదేశించింది. అదేవిధంగా బీచ్‌పల్లి దగ్గర సైతం కృష్ణానది నిండుకుండలా ప్రవహిస్తూ శ్రీశైలం జలాశయంలోకి పరుగులు పెడుతోంది. అయితే, కృష్ణానది వరద రావడంతో పాలమూరు జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను రన్ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. ఆదివారం నెట్టెంపాడు రిజర్వార్ 2250 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ ర్యాలంపాడు రిజర్వాయర్‌ను నింపుతున్నారు. గత మూడు, నాలుగు రోజుల నుండి ర్యాలంపాడు రిజర్వాయర్ కృష్ణానది నీటితో జలకళను సంతరించుకొంది. ఇకపోతే భీమా-1, 2 ఎత్తిపోతల మోటార్లు రన్‌లోనే ఉన్నాయి. దాదాపు మూడు వేల క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తుడడంతో భీమా పరిధిలోని సంగంబండ, భూత్పూర్, రామన్‌పాడు, సరళాసాగర్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల మోటర్లు సైతం నడుస్తుడడం.. దాంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు 600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పర్ధిపూర్ రిజర్వాయర్ నిండి అలుగుపారుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంకు సంబంధించిన రెండు మోటార్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి ఆదివారం కల్వకుర్తి కాల్వల వెంట తిరుగుతూ రైతులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. కల్వకుర్తి పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌లోని దాదాపు 1200 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో శ్రీవైలం ప్రాజెక్టులోకి కృష్ణానది పరుగులు పెడుతూ పాలమూరు జిల్లాలో నిండుకుండలా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాలమూరు జిల్లాలో పలు రిజర్వాయర్లకు కృష్ణా జలాలు పరుగులు తీస్తూ వస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో పలు రిజర్వాయర్లు సైతం నిండే అవకాశాలు ఉండడం.. దాంతో రైతులకు సాగునీరు విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది.