రాష్ట్రీయం

బంగారు బిందెతో దుర్గమ్మకు బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి): నగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ ఊరేగింపు కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం బంగారు బిందెతో బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సుమారు 400 మంది కళాకారులు వివిధ రకాలైన నృత్యాలను ప్రదర్శిస్తుండగా బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి సెంటర్ నుండి ఊరేగింపుగా వచ్చి తొలుత దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఘాట్‌రోడ్ మార్గంలో కొండపైకి చేరుకున్నారు. బోనాలను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య నుండి ఆలయ ఈవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు సూచనల మేరకు అర్చకులు అందుకున్నారు. బంగారు బిందెతో తీసుకొచ్చిన బోనాలతో పాటు అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పూజాసామగ్రి తీసుకొచ్చారు. వాటిని స్వీకరించిన ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్ అమ్మవార్లకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన వారందరీకి అమ్మవారి దర్శనం చేయించి దివ్య అశీస్సులిప్పించి ప్రత్యేక ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం అమ్మవార్లకు బోనాలు సమర్పించటం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ సంవత్సరంతో పదేళ్లు పూర్తయినట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వెంటనే ఇవ్వాలని, రెండు రాష్ట్రాల్లో వర్షాలు సకాలంలో కురిసి పాడిపంటలకు ఏ లోటూ లేకుండా చూడాలని దుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు కమిటీ సభ్యులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..బెజవాడ దుర్గమ్మకు బోనం చెల్లించేందుకు ఊరేగింపుగా వెళ్తున్న తెలంగాణ భక్తులు