రాష్ట్రీయం

శ్రీవారి ఆభరణాల లెక్కలకు కమిటీ వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 22: తిరుమలేశుని ఆభరణాలు ఎన్ని ఉన్నోయో లెక్కలు తేల్చి భక్తులకు వివరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామి డిమాండ్ చేశారు.
తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీని నేడు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. తమ మనోభావాలను పట్టించుకోకుండా తాము వద్దన్నా టీటీడీ పాలకమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారన్నారు. ఆనాటి నుంచి తిరుమలలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. బూందీ పోటులో అగ్నిప్రమాదం, రాష్ట్రంలో ఒకేసారి 46వేల పిడుగులు పడటం, శ్రీవారి పింక్ డైమండ్ అదృశ్యం, రమణదీక్షితుల వ్యవహారం, తాజాగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామనడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీవారి ఆభరణాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఒక కమిటీ వేయాలన్నారు. వేదిక్ కమిటీ సభ్యులు, పాలకమండలి సభ్యులు, స్వామీజీలు, జమాలజిస్టులతో కమిటీ వేసి ఆభరణాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగలకు మద్దతు ఇవ్వకుండా దొర ప్రభుత్వంలా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, హిందువుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈనెల 29వ తేదీన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర చేపట్టి ఆగస్టు 12న తిరుపతిలోని ఇందిరా మైదానానికి చేరుకుంటామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందు సీఎంను కలిసి తమ డిమాండ్లను తెలియజేస్తామన్నారు. పాదయాత్ర ముగిసేలోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఇందిరా మైదానంలో జరిగే సభలో 100 మంది పీఠాధిపతులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. టీటీడీలో అన్యమతస్థులు, ఎస్సీలకు పదోన్నతులు కల్పించడం, తిరుమలలో మద్యం, మాంసం నిషేధం మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
రోజుల పాదయాత్ర 500 గ్రామాల మీదుగా 300 మంది హిందూ ధర్మ కార్యకర్తలతో సాగుతుందన్నారు. ధర్మం కోసం పోరాడుతున్న స్వాములను గృహ నిర్బంధం చేయడం, బెదిరింపులకు పాల్పడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.