రాష్ట్రీయం

అవిశ్వాసంలో నైతిక విజయం మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నైతిక విజయం మాకే దక్కిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. విభజన హామీలన్నీ అమలు చేశామంటూ మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులనుద్దేశించి హేళనగా మాట్లాడటం మంచిది కాదన్నారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రాంతీయ పార్టీ నిలదీయడం దేశ చరిత్రలోనే తొలిసారిగా పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ హరిబాబు, ఆపార్టీ జాతీయ మహిళా నేత పురంధ్రీశ్వరి రాష్ట్రానికి అంతా చేసినట్టు చెప్పుకుంటున్నారని, ఇది ప్రజలను మోసపుచ్చడమేనన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు అంశాలను ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నట్టు చెప్పడం ద్వారా కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన జాతీయ విద్యా సంస్థల్లో ఒక్కటైనా సొంత భవనాల్లో నడుస్తున్నాయా అని ప్రశ్నించారు. విశాఖలో ఐఐఎం శంకుస్థాపన చేసి వదిలేశారని, రాష్ట్రం ప్రహరీ నిర్మించిందన్నా రు. తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీకీ శంకుస్థాపనే మిగిలిందన్నారు. సంస్థ లు మంజూరు చేసిన కేంద్రం వాటి నిర్వహణను విస్మరించిందన్నారు.