రాష్ట్రీయం

కిసాన్ సభ అధ్యక్షుడిగా ప్రబోధ్ పాండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆలిండియా కిసాన్ సభ నూతన కార్యవర్గం ఎన్నికైంది. జాతీయ అధ్యక్షుడిగా ప్రబోధ్ పాండా, ప్రధానకార్యదర్శిగా అతుల్‌కుమార్ అంజాన్‌లు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల కిసాన్ సభ జాతీయ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో కిసాన్ సభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ తెలిపారు. భారత ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ ఈ జాతీయ స్థాయి సమావేశాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు 45 మంది జాతీయ కార్యవర్గ సభ్యులను, 151 మంది నేషనల్ కౌన్సిల్ సభ్యులను ఈ సమావేశంలో ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 905 మంది ప్రతినిధులు ఈ జాతీయ స్థాయి సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. జాతీయ కార్యవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భూపేంద్ర సంభర్, ఉపాధ్యక్షులుగా ఆర్.వెంకయ్య (ఎపి), ఎన్.ఇబోబి (మణిపూర్), తారాసింగ్ సిద్దూ (రాజస్థాన్) ఎన్నిక కాగా, కార్యదర్శులుగా సత్యం మొకేరి (కేరళ), డాక్టర్ దురాయ్ మాణిక్యం (తమిళనాడు), నామ్‌దేవ్ గేవ్డే (మహారాష్ట్ర), పశ్య పద్మ (తెలంగాణ), రాజేందర్ యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్), ట్రెజరర్‌గా విజి సోమసుందరం (కేరళ) ఎన్నికైనట్లు అతుల్ కుమార్ తెలిపారు. జాతీయ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం నిజాం కళాశాల గ్రౌండ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఆలిండియా కిసాన్ సభ ముగింపు సభలో పాల్గొన్న
సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేంద్ర సంభర్ తదితరులు