తెలంగాణ

కుతుబ్ షాహీ సమాధులను సందర్శించిన ఉప రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, గవర్నర్ నరసింహన్‌తో కలిసి కుతుబ్ షాహీ సమాధులను సందర్శించారు. కుతు బ్ షాహీ సమాధులను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రతినిధులను, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఉప రాష్టప్రతి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టూరిజం సెక్రటరీ బి వెంకటేశం, మహేశ్ భగత్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పర్యటన
ఉపరాష్టప్రతి అన్సారీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఆదివారం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉపరాష్టప్రతికి గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, స్పీకర్ మధుసూధనాచారి, పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు.

ఆదివారం కుతుబ్ షాహీ సమాధులను సందర్శించిన ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, గవర్నర్ నరసింహన్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్య కేసులో
ఐదుగురు అరెస్టు

నాలుగు సెల్ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం
మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

హైదరాబాద్, మార్చి 6: సికిందరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హత్య కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు.
ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య జరిగిన తీరును పోలీసులు మీడియాకు వివరించారు. సంజయ్ జుంగీ (24) హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని బుధవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. అదే క్రమంలో కూకట్‌పల్లి వెళ్లి అక్కడ స్నేహితులతో కలసి పార్టీలో మద్యం సేవించాడు.
తెల్లవారుజామున స్నేహితుడితో కలసి బైక్‌పై పంజగుట్టకు వచ్చాడు. క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో బంజారాహిల్స్ నుంచి పాత బస్తీ వెళ్తున్న క్యాబ్‌ను సంజయ్ ఆపి, లిఫ్ట్ అడిగాడు. కారులో ఎక్కాక, మద్యం మత్తులో ఉన్న సంజయ్... కారులో ఉన్నవారితో వివాదానికి దిగాడు. ఘర్షణ చినికి చినికి గాలివానగా మారడంతో వారు సంజయ్‌ని స్వప్నలోక్ కాంప్లెక్స్‌వద్ద బలవంతంగా దించేశారు. కారు దిగిన సంజయ్, వారిని దుర్భాషలాడటంతో వారు కోపం పట్టలేక దాడికి దిగారు. కత్తులతో పొడవడంతో సంజయ్ నడి రోడ్డుపై అక్కడిక్కడే కుప్ప కూలి మృతి చెందాడు. కాగా పరారీలో ఉన్న నిందితులను పోలీసులు సిసి కెమెరా పుటేజ్‌లను పరిశీలించి కారును గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుల వివరాలు తెలిశాయని నిందితులు సయ్యద్ సల్మాన్, సయ్యద్ ముబాసిరుద్దీన్, మహమ్మద్ ముషర్రాఫ్, సయ్యద్ అబ్దుల్ రషీమ్, సయ్యద్ రిజ్వాన్‌లను అరెస్టు చేసి నాలుగు సెల్ ఫోన్లు, బైక్‌లు, కారును స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ నార్త్ జోన్ ఎడిషనల్ డిసిపి ఎన్ కోటిరెడ్డి తెలిపారు. కాగా ఏ2 నిందితుడు సయ్యద్ ముబాసరుద్దీన్ గతంలో సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచార కేసులో నిందితుడని డిసిపి పేర్కొన్నారు.

నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న పోలీసులు
వారి నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు