తెలంగాణ

గ్రూప్-2కి భలే గిరాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 రిక్రూట్‌మెంట్‌కు భారీగా 5,64,431 దరఖాస్తులు వచ్చాయి. 439 పోస్టులకుగానూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏప్రిల్ 24న రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 19, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టులు 110, గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్ పోస్టులు 23, పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 67, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇనస్పెక్టర్లు 220 పోస్టులున్నాయి. దరఖాస్తు చేసిన వారిలో 7628 మంది అభ్యర్ధులను సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడం, ఫోటో లేకపోవడం లేదా అభ్యర్ధి పేరుకు తండ్రిపేరుకు పొంతన లేకపోవడం, సంతకం లేకపోవడం తదితర కారణాలతో కమిషన్ తిరస్కార జాబితాలో ఉంచింది. వారికి చివరి అవకాశంగా 12లోగా డాటా సరిగా నింపాల్సిందిగా ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లను పంపించారు. అలాగే మరో 256 మంది అభ్యర్ధులు అర్హత లేని పోస్టులకు దరఖాస్తు చేశారు. స్పెషలైజ్డ్ అర్హత ఉన్న వారు మాత్రమే అర్హులైన పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారి పేర్లను కూడా పక్కన పెట్టారు.
ఇంత వరకూ వచ్చిన దరఖాస్తుల్లో 2,03,379 మంది మహిళా అభ్యర్ధులు, 3,61,052 మంది పురుష అభ్యర్ధులున్నారు. సిటీ క్యాడర్ నుండి 15,366 మంది దరఖాస్తు చేయగా, ఇతరులు 15,498 మంది, జోన్ 5 నుండి 2,44,050 మంది, జోన్ -6 నుండి 2,89,517 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో 34ఏళ్లలోపు వారు 5,00,325 మంది, 39 ఏళ్లలోపు వారు 44,883 మంది, 44 ఏళ్లలోపు వారు 16,465 మంది కాగా, 44 ఏళ్లు దాటిన వారు 2758 మందిన్నారు. పిహెచ్ క్యాటగిరిలో 9405 దరఖాస్తులు వచ్చాయి. అందులో విహెచ్ 818 మంది, హెచ్‌హెచ్ 425 మంది, ఒహెచ్ 8162 మంది ఉన్నారు. డిగ్రీ చదివిన వారు 5,42,369 మంది కాగా లా డిగ్రీ చేసిన వారు 3662 మంది ఉన్నారు. బిటెక్ చేసిన వారు 9204 మంది, పిజి చేసిన వారు 2226 మంది, ఎంబిఎ 2121, డాక్టర్లు 146 మంది, ఫార్మసీ 194 మంది, లా గ్రాడ్యూయేట్లు 3 3మంది, బయోటెక్ డిగ్రీ చేసిన వారు 71 మంది, సిఎ చేసిన వారు 13 మంది, ఎంఫిల్, పిహెచ్‌డి చేసిన వారు 15 మంది, బిఇడి చేసిన వారు 204 మంది, ఇతర అర్హతలున్న వారు 4173 మంది ఉన్నారు.
మొత్తం దరఖాస్తుల్లో బిసి-ఎ నుండి 45,966, బిసి బి నుండి 1,32,943 , బిసి సి నుండి 3794 మంది, బిసి డి నుండి 1,14,863 మంది, బిసి ఇ నుండి 23,484 మంది, ఒసిలు 76381 మంది, ఎస్సీలు 1,15,689 మంది ఎస్టీలు 513112 మంది దరఖాస్తు చేశారు.
జిల్లాల వారీ చూస్తే ఆదిలాబాద్ నుండి 42,911 , హైదరాబాద్ నుండి 50,781, కరీంనగర్ నుండి 80,442, ఖమ్మం నుండి 49,757 మంది, మహబూబ్‌నగర్ నుండి 57,384 మంది, మెదక్ నుండి 39536 మంది, నల్గొండ నుండ్మింది, నిజామాబాద్ నుండి 33473 మంది, రంగారెడ్డి నుండి 49792 మంది, వరంగల్ నుండి 73250 మంది, ఇతర ప్రాంతాల నుండి 10477 మంది దరఖాస్తు చేశారు.