రాష్ట్రీయం

బీజేపీ ఓటమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన నాలుగేళ్లుగా ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తూనే వచ్చిందన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేశామని చెప్పారు. దేశంలో ఆంధ్రులు ఎక్కడున్నా, బీజేపీని ఓడించడం కోసం పని చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీలా తమ పార్టీ బీజేపీతో లాలూచీ పడలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని ప్రకటించి, చివరికి అతనికే ఓటు వేశారని అన్నారు. దీన్నిబట్టి ఆయా పార్టీల వైఖరి ఏమిటో ప్రజలకు అర్థమైందని లోకేష్ చెప్పారు. నాలుగేళ్లుగా ఏపీని మోసగించిన
బీజేపీకి వ్యతిరేకంగా మా కార్యాచరణ ఏవిధంగా ఉంటుందో భవిష్యత్‌లో అంతా చూస్తారని లోకేష్ అన్నారు.
వెనుకబడిన జిల్లాలకు కేంద్రం అద్భుతంగా నిధులు ఇచ్చిందని ఆ పార్టీకి చెందిన ఎంపీ నరసింహారావు చెపుతున్నారు. మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు తలసరి 400 రూపాయలు ఇస్తే, బందేల్‌ఖండ్‌కి నాలుగు వేల రూపాయలు ఇచ్చారని లోకేష్ చెప్పారు. ఏపీకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఫరవాలేదన్న ధీమాతో కేంద్రం ఉందని అన్నారు. నరసింహారావు ఏపీకి చెందిన ఎంపీ కాదు. కానీ ఏపీ ప్రజలపై ఆయన ఏవిధంగా పెత్తనం చేస్తారని లోకేష్ ప్రశ్నించారు. పీడీ అక్కౌంట్‌ల గురించి ఆయన అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గుజరాత్, మహారాష్టల్రో పీడీ అక్కౌంట్‌లు ఉన్నాయి. పంచాయతీ వ్యవస్థ నడిచేది పీడీ అక్కౌంట్‌లపైన అని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కేంద్రం చెప్పినట్టే, ప్రతి పంచాయతీకి అక్కౌంట్‌లు తెరిచామని తెలియచేశారు. ఈ అక్కౌంట్‌లన్నీ సీఎంఎస్‌కి లింక్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరైనా పరిశీలించుకోవచ్చని అన్నారు. పీడీ అక్కౌంట్‌లు ఉన్న రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడం లేదని లోకేష్ చెప్పారు. పీడీ అక్కౌంట్‌లలో అవినీతి జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్ వస్తే ఆయన ఆంధ్రునిగా ఓర్చుకోలేకపోతున్నాడని అన్నారు. అవినీతి వస్తే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి ఉంటే, ఇన్ని పరిశ్రమలు వచ్చేవా? అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉంటే మంచివాళ్లం, బయటకు వస్తే అవినీతిపరులం అంటున్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తామని చెపుతున్న అవినీతి పుత్రుడు బయట తిరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు? పలు కేసులలో ఏ2గా ఉన్న వ్యక్తిని ప్రధాని కార్యాలయంలోకి ఎందుకు అనుమతిస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని అన్నారు.
కేంద్రం డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. హైకోర్టు, సచివాలయం నిర్మాణాలను త్వరలో చేపడతామని చెప్పారు. అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు అమరావతికి వస్తున్నాయి. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా, ఆంధ్రుల కల అమరావతిని పూర్తి చేసి తీరుతామని ఆయన అన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్