రాష్ట్రీయం

బీసీల సంక్షేమానికి రూ.6 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమానికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఖరారు చేసిన ప్రణాళికకు దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సచివాలయంలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో జోషి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, బీసీ విద్యార్థుల మెయింటనెన్స్ ఫీజుకు రూ.487 కోట్లు, బీసీ, ఈబీసీ ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు
రూ.1100 కోట్లు, ఓవర్‌సీస్ విద్యానిధికి రూ.60 కోట్లు, కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.700 కోట్లు కేటాయించినట్టు వివరించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46,250 మందికి సహాయం అందించామన్నారు. రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయన్నారు. రాష్టవ్య్రాప్తంగా 450 ఫ్రీమెట్రిక్, 250 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు పని చేస్తున్నాయన్నారు. వీటిలో 1,34,000 మంది విద్యార్థులు ఉన్నరన్నారు. బీసీ విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు స్టడీ సర్కిల్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నమన్నారు. బీసీ అభ్యర్థులు గ్రూప్-1,గ్రూప్-4 వంటి ఉద్యోగాలు పొందేలా స్టడీ సర్కిల్స్ కృషి చేయాలన్నారు. స్కిల్ డవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వడానికి స్టడీ చొరవ చూపాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో ఏస్‌ఏస్‌సీ, ఇంటర్మీడియట్‌లో గత ఏడాది ఫలితాలు సాధించిన విధంగా ఈ సారి కూడా సిబ్బంది కృషి చేయాలని సీఏస్ సూచించారు. ఎకనామిక్ సపోర్టు స్కీమ్‌కు సంబంధించి ఇడివిజువల్, స్మాల్ స్కేల్ బిజినెస్‌కు రూ.50 వేలు పూర్తి సబ్సిడీగాను, అప్ గ్రేడేషన్ స్కిల్స్‌కు సంబంధించి రూ.80 వేలు సబ్సిడీ, రూ.20 వేలు లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుందని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బి వెంకటేశం వివరించారు. వివిధ బీసీ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 5,76,000కు పైగా దరఖాస్తులు అందాయన్నారు. వీటిని గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నమన్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో చదివిన ఇంటర్ విద్యార్థులు ఐఐటీ, ఏన్‌ఐటీ, ఐఐఐటీ వంటి వివిధ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో 18 సీట్లు పొందారని ఆయన వివరించారు.

చిత్రం..బీసీ సంక్షేమ శాఖాధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి