రాష్ట్రీయం

జన యాత్రలు కావు... ప్రజా వంచన యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి పార్టీ ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి తన కుమారుడు లోకేష్‌ను ప్రమోట్ చేసేందుకే జన చైతన్య యాత్రలు చేపడుతున్నారని ఆయన మంగళవారం పార్టీ నాయకులు కనుమూరి బాపిరాజు, గంగా భవానీ, జంగా గౌతమ్, రవిచంద్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవి జన చైతన్య యాత్రలు కాదు ప్రజా వంచన యాత్రలని ఆయన దుయ్యబట్టారు. 12 లక్షల మందికి పెన్షన్లు తొలగించామని, కోటి మందికి తెలుపు రంగు రేషన్ కార్డులు, 20 లక్షల మంది ఇందిరమ్మ గృహ లబ్దిదారులకు బిల్లులు చెల్లించకపోవడం, 1340 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయామని, ఈ ఏడాదిలో కరవు ఉన్నా కేంద్రానికి నివేదిక పంపించలేకపోయామని ప్రజలను చైతన్యవంతం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాను, భారీ వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. కేవలం కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారని, మంత్రులు పర్యటించారని ఆయన విమర్శించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఇవ్వలేదని విమర్శించారు. సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు పంపిణీ చేశామంటున్న 25 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు చాలా మందికి అందలేదని ఆయన తెలిపారు. రోజువారీ కూలీలు గత నెల రోజులుగా ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘువీరా విమర్శించారు.
ఇందిరమ్మ ఫొటో ఉంటే..
ఎవరి ఇళ్ళలోనైనా ఇందిరమ్మ ఫొటో, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో కనిపిస్తే ఆ కుటుంబాన్ని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయాన్ని అందించే జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. తుపాను బాధితులకు సహాయం అందించడంలోనూ రాజకీయ కోణంలో చూడడం దురదృష్టకరమని అన్నారు. తుపాను సహాయక చర్యల కోసం 3 వేల కోట్లు కావాలని, అందులో వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, తొలుత మీ వద్ద ఉన్న నిధులను ఖర్చు చేయాలని కేంద్రం సూచించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఖలేజా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆనం సోదరుల రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.