రాష్ట్రీయం

జీఎస్‌టీని సరళతరం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: వస్తు సేవల పన్నును మరింత సరళతరం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువ పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు రాహుల్ నగరంలోని తాజ్‌కృష్ణలో యువ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు బ్రాహ్మణి, ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్, సీనిమా ప్రొడ్యూసర్ సురేష్‌బాబులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 140 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశం, రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. జీఎస్‌టీ, నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయాలతో సాధారణ ప్రజలు, చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక, వ్యాపార వేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న మోదీ కొన్ని సంస్థలకే లబ్ధి చేకూరుస్తోన్నారని మండిపడ్డారు. కేవలం 10-15 సంస్థలకే బ్యాంకు రుణాలు, ఇతర సౌకర్యాలు అందుతుండగా, మిగిలిన సంస్థలు దివాలా తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. దేశంలో బ్యాకింగ్ వ్యవస్థను దెబ్బతీశారని, సాదారణ ఖాతాదారుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెనువెంటే ఈ పరిస్థితులన్నింటిని సరిచేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సమాన అవకాశాలు కల్పిస్తామని, అన్ని ప్రాంతాల్లోని పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్‌తో సమావేశమైన పారిశ్రామిక వేత్తలు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినట్ట భట్టి విక్రమార్గ తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు హెరిటేజ్ డైరెక్టర్ నారా బ్రహ్మణిని అభినం దించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామని చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న వారు హర్షాతిరేకాలు చేసినట్టు సంపత్‌కుమార్ తెలిపారు.

రాహుల్‌తో రోశయ్య, కిరణ్ భేటీ
రాహుల్ గాంధీని మాజీ ముఖ్యమంత్రులు కె. రోశయ్య, ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి కలిసి మంతనాలు జరిపారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో విడిదిచేసిన రాహుల్‌ను మంగళవారం ఏపీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. రోశయ్య కూడా రాహుల్‌ను కలిసి మంతనాలు జరిపారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారిరువురూ చర్చించారు. ఏపీలో వెంటనే అధికారంలోకి రాలేకపోయినా, బలమైన ప్రధాన ప్రతిపక్ష హోదానైనా సాధించాలని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించినట్లే ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పర్యటించాల్సిందిగా కిరణ్‌కుమార్ రెడ్డి ఆయన్ను ఆహ్వానించారు. అంతకుముందు ఏఐసీసీ ఎస్‌సీ కమిటీ చైర్మన్ కొప్పుల రాజు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో రాహుల్ సమావేశమయ్యారు.