రాష్ట్రీయం

భద్రాద్రి జిల్లాలో కంపించిన భూమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం/భద్రాచలంటౌన్, ఆగస్టు 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఇళ్లలో వున్న వస్తువులు కింద పడటం, మంచాలు, కుర్చీలు వంటి వస్తువులు కదలటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం వచ్చే ముందు కుక్కలు, ఇతర జంతువులు అరిచినట్టు స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం పరిధిలోని కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, చండ్రగొండ, టేకులపల్లి పట్టణాల్లో కూడా భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. సింగరేణి గనుల ప్రాంతమైన ఈ ఏరియాలో భూకంపం రావడంతో సింగరేణి ఉద్యోగులు, ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. ముందుగా బూర్గంపహాడ్ మండలంలో భూకంప ప్రకంపనలు మొదలవ్వగా, కొన్ని క్షణాల్లో మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ తదితర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లల్లో ఉన్న వారు భూమి కంపించడంతో భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. నేలపై నిలబడిన వారు విద్యుత్‌షాక్ కొట్టిందేమోనని భయకంపితులయ్యారు. భద్రాచలం పట్టణంలో జనమంతా రోడ్లపైకి పరుగులు తీయడంతో ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. ప్రసార మాధ్యమాల్లో భూ ప్రకంపనలు వచ్చాయన్న వార్త విస్తృతంగా వ్యాపించడంతో ఇళ్లల్లోకి వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందారు. భూ ప్రకంపనలు జిల్లావ్యాప్తంగా ఉండటంతో ప్రజలు ఆరుబయటే నిరీక్షించారు. 3 నుంచి 5సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు కంగారు పడ్డారు. పలు ప్రాంతాల్లో ప్రకంపన ధాటికి ఇళ్లల్లోని సామాగ్రి కిందపడినట్లు తెలిసింది. భూకంపంపై వివరణ తీసుకునేందుకు సంబంధిత అధికారులను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.