తెలంగాణ

ఇదేనా నీ సంస్కారం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు మీరే.. * రాహుల్ పర్యటనతో తెరాస బెంబేలు
* చరిత్ర చెబితే బయట తిరగలేవు తమ్ముడూ * కంటి పరీక్షలు ముందుగా మీరే చేసుకోవాలి
‘కేటీఆర్’పై నిప్పులు చెరిగిన ‘పొన్నం’
కరీంనగర్, ఆగస్టు 16: ‘జెన్నకిడిసిన ఆంబోతులా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నాడని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని, ఇదేనా నీ సంస్కారం’ అంటూ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్సోళ్లు లుచ్చాగాళ్లు, గంగిరెద్దులు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ మీ నాయనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్సే అన్న విషయం మరిచిపోవద్దని హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా అమెరికాలో చిప్పలు కడిగి, తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడికి వచ్చి అధికార మదం తో కాంగ్రెస్సోళ్లు లుచ్చాగాళ్లంటూ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ నీ చరిత్ర బయట పెడితే బయట తిరగలేవని, అవసరమైనప్పుడు బయట పెడతామని, ఇప్పటికైన ఓళ్లు దగ్గర పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడూ.. అంటూ వ్యాఖ్యానించారు. ఒక మహిళ కూడా లేని మంత్రివర్గంలో ఉన్న కేటీఆర్ మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశా రు. విజ్ఞత, సంస్కారం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చకు రావాలని, అంతేగాని వ్యక్తిగత, పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని అన్నారు. టీఆర్‌ఎస్ నిర్వహించిన ఆరు సర్వేల్లో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని తెలిసి, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నది నాలుగేళ్లల్లో రూ.2 లక్షల కోట్ల అప్పులు చేయడానికి కాదని, ప్రజలను తాత్కాలిక భ్రమలో ముంచి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. సీఏం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఉద్యమ సమయంలో రెచ్చగొట్టడంతోనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని, ఆనాడు 1500 మంది చనిపోయారంటూ మాట్లాడిన కేసీఆర్, హరీష్ అధికారంలో రాగానే ఆ సంఖ్య 400 లకు చేర్చారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలతో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్నారు సరే..తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధి తాజా పర్యటనతో తెరాస నేతల్లో భయం పట్టుకుందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అవును కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ అవినీతి కోసమేనని ఆరోపించారు. కరీంనగర్‌లో మేము చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్లే స్మార్ట్‌సీటీ వచ్చిందని అన్నారు. నిన్ను, మీ నాయనను మూడుసార్లు గెలిపిస్తే కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాను ముక్కలు చెక్కలు చేశారే తప్ప ఏం చేయలేదని, నాలుగేళ్లుగా యూనివర్సిటీకి వీసీని నియమించలేదని అన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లు ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. తుటా లేని తుపా కీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి కూడా కాంగ్రెసోళ్లు కంటి పరీక్షలు చేసుకోవాలని మాట్లాడితే అర్థం కావటం లేదని విమర్శించారు. కంటి పరీక్షలు ప్రజల కంటే ముందుగా రాష్ట్ర మంత్రులు చేయించుకోవాలని సూచించారు.