రాష్ట్రీయం

సాగర్ ఎడమ కాలువకు22నుంచి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు చేరుతుండటంతో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఈ నెల 22 నుంచి నీరు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ మంచినీటి అవసరాలకు నీటిని నిల్వ చేసి, మిగిలిన నీటిని ఎడమ కాలువ ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆయకట్టుకు అందించాలని మంత్రి ఆదేశించారు. జలసౌధలో శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. కృష్ణానది ఎగవ ప్రాంతం లో కురిసిన వర్షాల వల్ల నాగార్జునసాగర్ జలాశయంలోకి నీరు చేరుతుండటంతో ఎడమ కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజాప్రతినిధులు కోరారు. ఈ అంశంపై అధికారులతో చర్చించిన అనంతరం నీటి విడుదలకు మంత్రి నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్ర, ఆల్మట్టి డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతానికి వస్తోన్న వరద ప్రవాహంపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు చేరుతున్న నీటిపై మంత్రి ఆరా తీసారు. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు పెరుగుతుండటంతో సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు వివరించారు. వరద నీటిని అంచనా వేస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడాలని నిర్ణయించినట్టు మంత్రి వివరించారు. అదే విధంగా ఎలిమినేటి మాదవరెడ్డి వరద కాలువ, సాగర్‌లో లెవల్ కెనాల్ పరిధిలోని చెరువులను మంచినీటి అవసరాల కోసం నింపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నీటి విడుదలకు రైతు సమన్వయ సమితి ప్రతినిధులతో చర్చించి ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిని వృథా చేయకుండా ఆన్ ఆఫ్ పద్ధతిలో పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు మంత్రి సూచించారు. నీటి విడుదలకు ముందు ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తూములు, కాలువలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.
2.94 లక్షల ఎకరాలకు నీరు
రాష్ట్రంలోని 28 మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 2.94 లక్షల ఎకరాలకు సాగునీటిని ఖరీఫ్‌లో అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో గోదావరి పరివాహకంలో 21 ప్రాజెక్టుల కింద లక్ష 92 వేల ఆయకట్టు, కృష్ణా పరివాహకంలో ఏడు ప్రాజెక్టుల కింద లక్ష రెండు వేల ఆయకట్టు ఉందని అధికారులు వివరించారు.