రాష్ట్రీయం

హేయం... ఘోరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 17: అయినవారే చిన్నారుల బతుకులు ఛిద్రం చేస్తున్నారు. వీరి పైశాచికత్వానికి అనె్నంపుణ్యం ఎరుగని తొమ్మిదో తరగతి విద్యార్థిని(14) జీవితం బుగ్గి పాలైంది. మాయమాటలు చెప్పి ఓ చిన్నారిని లోబర్చుకున్న పొరుగింటి యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అడ్డుకోవాల్సిన సోదరుడే వావివరసలు మరచి తన పశువాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా గర్భం దాల్చిన ఆ చిన్నారి తొమ్మిది నెలలు ఆ పాపాన్ని మోసింది. గురువారం అర్ధరాత్రి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో మృత ఆడశిశువుకు జన్మనిచ్చింది. రక్తసంబంధాలను, నైతిక విలువలను మంటగలిపే ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రం సమీపంలోని ఓ కాలనీలో చోటుచేసుకుంది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత బాలిక అనంతపురం నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లి మరణించడంతో తండ్రి, సోదరుడితో కలిసి బుక్కరాయసముద్రం సమీపంలోని ఓ కాలనీలో ఉంటోంది. అదే కాలనీకి చెందిన డ్రైవర్(26) ఏడాది క్రితం బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనేకసార్లు తన కోర్కె తీర్చుకున్నాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబసభ్యులు నిలదీశారు. మోసపోసిన చెల్లికి రక్షణ కల్పించాల్సిన సోదరుడు కామంతో కళ్లు మూసుకుపోయి ఏడాదిగా ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తండ్రి అబార్షన్ చేయించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐదో నెల దాటినందున బాలిక ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని పరీక్షల్లో తేలడంతో కడుపులో కణితి(గడ్డ) పెరుగుతోందని, పేదరికంతో ఆపరేషన్ చేయించుకోలేక పోతున్నామని కాలనీ వాసుల్ని వారు నమ్మిస్తూ వచ్చారు. గురువారం రాత్రి నొప్పులు రావడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ప్రసవం చేయడంతో మృత ఆడశిశువుకు జన్మనిచ్చింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మృతశిశువును తండ్రి ఖననం చేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా తనపై కాలనీకి చెందిన డ్రైవర్, సోదరుడు అఘాయిత్యం చేసినట్లు బాలిక చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. డ్రైవర్, బాలిక సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖననం చేసిన మృతశిశువును తహశీల్దార్ సమక్షంలో వెలికితీశారు. డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం శ్యాంపిల్స్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.