తెలంగాణ

విస్తారంగా వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 17: కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువజాము నుంచి రాత్రి వరకు మోస్తారు నుంచి భారీగా వర్షం కురిసింది. వానలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతుండగా, పలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు జల కళను సంతరించుకున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు విరిగిపడి, రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోగా, ఇళ్లల్లోకి వచ్చి చేరిన నీటిని తోడేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రామగుండం రీజియన్ పరిధిలోని 1,2,3,4ఓసీపీల్లో మొత్తం 48వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో వాన బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ చెట్లు పడిపోగా, మిషన్ భగీరథ పనులు కొనసాగుతుండటంతో ఆయా కాలనీవాసులు ఇక్కట్లకు గురయ్యారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, సుల్తానాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, హుజురాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. కొన్ని మండలాల్లో చిరు నుంచి మోస్తారు వానలు కురిసాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలో 1500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. మిగితా జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 2.04మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో 2.05 నుంచి 15.5మిల్లీమీటర్లు వరకు నమోదైంది. మొత్తానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీటి వనరులు జల కళను సంతరించుకుంటుండగా, సామాన్య జనాలకు మాత్రం కొంతమేర ఇబ్బందులు తప్పలేదు.