రాష్ట్రీయం

రెండుసార్లు ‘నీట్’ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: దేశంలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ ప్రవేశానికి నీట్ - యూజీ 2019 నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి అప్పగించినా, వివాదాలు మాత్రం వీడలేదు. గత ఏడేళ్ల నుండి అనేక వివాదాలతో సతమతమవుతున్న నీట్ నిర్వహణను ప్రత్యేకించి జాతీయ స్థాయి సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ)కి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అప్పగించిన విషయం తెలిసిందే. అడ్మిషన్లలో ఏటా జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు ఏటా రెండు మార్లు, అంటే ఫిబ్రవరి ఒకసారి, మే నెలలో మరోసారి, నీట్ పరీక్షను యూజీ నిర్వహించనున్నట్టు ప్రకటించడంతో వివాదం మొదటికి వచ్చింది. స్వల్పవ్యవధిలో రెండు మార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఎనలేని భారం పడుతుందని, అది ఒత్తిడికి ఇతర మానసిక సమస్యలకు దారి తీస్తుందని మానసికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంటోంది. నీట్‌ను 8 రోజుల పాటు ఉదయం సాయంత్రం 16 మార్లు నిర్వహించాలంటే అందుకు రూపొందించిన కంప్యూటర్ ఆధారిత బుక్ బ్యాంకులు సరిపోవని, ఒకటి రెండు సంవత్సరాలు నీట్ నిర్వహించేసరికి ప్రశ్నలు వచ్చినవే రావడం, బుక్ బ్యాంకు ఖాళీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రెండు మూడేళ్లు గడిచేసరికి ప్రశ్నల కొరత ఏర్పడుతుందని మరో వాదన వినిపిస్తోంది. ఇంకో పక్క ప్రైవేటు కార్పొరేట్ శిక్షణ సంస్థలు బిట్‌లను సేకరించేందుకు నకిలీ అభ్యర్థులను రంగంలోకి దించుతాయని, పరీక్షకు హాజరై ఏ ప్రశ్నలు వచ్చాయో నమోదు చేసి ఇవ్వడానికి వారిని రంగంలోకి దించుతారని ఇది మరో సమస్యకు కారణమవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి పరీక్షకు అక్టోబర్ 1వ తేదీ నుండి షెడ్యూలు ఖరారు చేశారు. పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుండి 17వ తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. వాటి ఫలితాలు మార్చిలో జరుగుతాయి. ఇది కూడా రాష్ట్రాల బోర్డులు నిర్వహించే పరీక్షలు, ప్రయోగ పరీక్షల షెడ్యూలుతో ఇబ్బంది అవుతోంది. సహజంగా ఆ సమయంలో బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతుంటాయి. అదే సమయంలో ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంటారు. ప్రాక్టికల్ పరీక్షల ఒత్తిడి, నీట్ ప్రవేశపరీక్ష ఒత్తిడి వారిపై ఉంటుందని చెబుతున్నారు. మే నెలలో నిర్వహించే నీట్ పరీక్షకు మార్చి రెండో వారంలో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంటర్ రెగ్యులర్ పరీక్షలు మొదలవుతాయి. మే 12 నుండి 26వ తేదీ వరకూ నీట్ నిర్వహించాలని షెడ్యూలు రూపొందించగా, అప్పుడే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో విద్యార్థులపై పడే ఒత్తిడిని తప్పించాలంటే నీట్‌ను వచ్చే ఏడాదికి( 2019) ఒకే మారు నిర్వహించాలని, ఆ తదుపరి సంవత్సరాల నుండి రెండు మార్లు నిర్వహించినా ముందస్తు ప్రణాళిక ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు నీట్ నిర్వాహణపై ఎన్‌టీఏ పునరాలోచనలో పడిందని సమాచారం.