రాష్ట్రీయం

ఆలయ నిర్మాణాలకు 80 శాతం నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: దేవాలయాల నిర్మాణానికి, మరమ్మతులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ 80 శాతం నిధులను ఇచ్చేందుకు నిర్ణయించింది. దేవాలయాల కమిటీ లేదా భక్తులు 20 శాతం నిధులు భరిస్తే సరిపోతుంది. ఈ మేరకు శనివారం జీఓ జారీ చేశారు. కొత్తగా ఆలయాలు నిర్మించుకునేందుకు, పాత ఆలయాల పునరుద్ధరణ కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుండి నిధులిస్తుంది. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించే కమిటీ లేదా భక్తులు దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి పంపించే అంచనాల ప్రకారం 20 శాతం నిధులను సంబంధిత కమిటీ లేదా ప్రజలు మ్యాచింగ్ గ్రాంట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ మ్యాచింగ్ గ్రాంట్ 33.33 శాతంగా ఉండేది. దేవాదాయ శాఖ 66.67 శాతం ఇచ్చేది. ఈ నిబంధనలో సవరణ చేస్తూ, దేవాలయ కమిటీ లేదా భక్తులు 20 శాతం నిధులను భరిస్తే సరిపోతుందని నిర్ణయించారు. మిగతా 80 శాతం నిధులు దేవాదాయ శాఖ ఇస్తుంది. అంటే దేవాదాయ శాఖ ఎక్కువ మొత్తంలో సీజీఎఫ్ నుండి నిధులు ఇచ్చేందుకు నిర్ణయించింది. అత్యధికంగా రూ.50 లక్షల వరకు సీజీఎఫ్ నుండి ఇవ్వాలని గత ఏడాది నిర్ణయించారు. దేవాదాయ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల అనేక మంది ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు.