రాష్ట్రీయం

జనం వద్దకు మనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 18: జిల్లాల్లో చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాల వల్ల చెరువుల్లో నీటిని నిల్వచేసి సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్న ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థ నీటి నిర్వహణ ద్వారా రైతులకు తగిన విధంగా అండగా నిలిచామని సంతృప్తి వ్యక్తంచేశారు. గ్రామ, వార్డు వికాసం కార్యక్రమాల సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 75 రోజులు క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. రానున్న 60 రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డులలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా చెరువులు నింప గలిగామని ప్రభుత్వం చేపట్టి పూర్తిచేస్తున్న ప్రాజెక్టుల వల్లే చెరువుల్లోకి నీరు చేరిందని తెలిపారు. రైతులకు మనం అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలన్నారు.

28న మైనారిటీ సదస్సుపై దృష్టి సారించండి
ఈనెల 28న ‘నారా హమారా..టీడీపీ హమారా’ నినాదంతో నిర్వహించే మైనారిటీల సదస్సు విజయవంతంపై నాయకులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సదస్సుకు మైనారిటీలంతా తరలివచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా మైనారిటీ నాయకులు, పార్టీ ముఖ్యులతో ఈ విషయమై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చర్చించారు. మైనారిటీల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం నాలుగేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.200 కోట్లు ఉన్న మైనారిటీల బడ్జెట్‌ను ప్రస్తుతం రూ వెయ్యి కోట్లకు పైగా పెంచామని గుర్తుచేశారు. విజయవాడ, కడపలో హజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నతవిద్యకు అవకాశం కల్పించేందుకు ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దమొత్తాన్ని స్కాలర్‌షిప్స్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ల కోసం కేటాయిస్తోందని వివరించారు. మక్కా దర్శించుకునే హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందన్నారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశామన్నారు.