రాష్ట్రీయం

కేరళకు ఏపీ సహాయక బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): కేరళ రాష్ట్రానికి సహాయక చర్యలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు నేతృత్వంలో ప్రత్యేక సహాయక బృందాలు శనివారం కేరళకు బయలుదేరాయి. గడిచిన వందేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విలయతాండవం గత తొమ్మిదిరోజులుగా కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. జల విలయంలో చిక్కుకుని కుదేలవుతున్న కేరళ రాష్ట్రానికి సహాయక చర్యలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక బృందాలు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళాయి. ఈ ప్రత్యేక సహాయక బృందంలో 66మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం, ఒక జిల్లా ఫైర్ అధికారి, ఒక అసిస్టెంట్ ఫైర్ అధికారి, ఐదుగురు స్టేషన్ ఫైర్ అధికారులు, ఒక విపత్తుల నిర్వహణ శాఖాధికారి, ఒక బోటు మెకానిక్, ఒక స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్‌తోపాటు 12 మోటారు బోట్లు, ఇతర రక్షణ పరికరాలు తరలివెళ్లాయి. విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు, ఫైర్ డీజీ సత్యనారాయణ, విపత్తుల నిర్వహణ శాఖ పరిపాలనాధికారిణి సుమతికుమారి, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి కిషన్‌సంకు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో బృందాలను కేరళ రాష్ట్రానికి పంపించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఏపీ ప్రత్యేక బృందాలు కేరళలోని త్రివేండ్రం చేరుకుని అక్కడి నుంచి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.