రాష్ట్రీయం

చంద్రులు వెనుకబడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ధీమా వ్యక్తం చేసిన ఇద్దరు చంద్రులూ వెనుకబడ్డారు. దేశంలో ఎవరు ఉత్తమ ముఖ్యమంత్రి? అని ఇండియా-టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో ఓటర్ల నాడి తెలిసింది. ఈ సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వెనుకబడ్డారు.
ముఖ్యమంత్రుల పని తీరుపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మమతా 13 శాతంతో ముందు వరుసలో నిలిచారు. ఆ తర్వాత స్థానాన్ని బీహార్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ 10 శాతంతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. మూడవ స్థానాన్ని, 9 శాతంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దక్కించుకున్నారు. లోగడ పలు పర్యాయాలు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పనితనంలో మాత్రం 7 శాతంతో వెనుకబడ్డారు. ఆ తర్వాత ఐదు శాతంతో చత్తీస్‌గఢ్
ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నిలవగా, పని తీరులో నాలుగు శాతం మద్దతు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు లభించింది. ఇక కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు మూడు శాతం లభించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌కు రెండు శాతం మాత్రమే సానుకూలత వ్యక్తమైంది.
ప్రధాని మోదీనీ ఎదిరించి వీర వనితగా దీదీ నిలబడ్డారు. అయితే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ మాత్రం బాగా వెనుకబడ్డారు. చంద్రబాబుకూ అదే పరిస్థితి ఉంది. కాకపోతే కేసీఆర్ కంటే చంద్రబాబు పని తీరు కొంత బాగుందని సర్వేలో తేలింది. ఈ లెక్కన ఫెడరల్ ఫ్రంట్‌కుగానీ, చంద్రబాబు చేయాలనుకునే ఫ్రంట్‌కు గానీ ఆశించిన ప్రయోజనం ఉండదని తేటతెల్లమవుతోంది. దీదీ గట్టిగా నిలబడితే తప్ప కొత్త ఫ్రంట్‌కు ప్రయోజనం ఉండబోదని స్పష్టమవుతున్నది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ఇక మిగిలింది ఎనిమిది నెలలే కాబట్టి ఈలోగా ఫ్రంట్‌లు ఎన్ని పుట్టుకుని వస్తాయో, వాటిల్లో ఎన్ని మునుగుతాయో! ఎన్ని తేలుతాయో! వేచి చూద్దాం.