రాష్ట్రీయం

జేఈఈ రద్దు యోచన విరమణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ఇంజనీరింగ్ యూజీ కోర్సులను రద్దు చేసి, వాటిని కేవలం పీజీ కోర్సులకు, పరిశోధనలకే పరిమితం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను ఐఐటీలు తిప్పికొట్టాయి. దీనితో జెఈఈల రద్దు యోచనను కేంద్రం విరమించే అవకాశాలున్నాయి. ఒకటిరెండు రోజుల్లో ఈమేరకు ఉత్తర్వులు జారీ కావచ్చని సమాచారం. యూజీ కోర్సులు ఐఐటీలకు పునాది వంటివని వాటిని రద్దు చేయాలనే యోచన సరికాదని సోమవారం ఈ అంశంపై జరిగిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో పలు ఐఐటీల డైరెక్టర్లు పేర్కొన్నారు. యూజీ కోర్సులను రద్దు చేసే పక్షంలో జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను కూడా నిర్వహించాల్సిన పనే్లదని, జెఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల ద్వారానే సీట్ల కేటాయింపు జరిపితే సరిపోతుందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఎంటెక్ సీట్లకు, పీహెచ్‌డీలకు మాత్రమే ఐఐటీలను పరిమితం చేస్తే యూజీ కోర్సులు లేకపోవడం వల్ల ఐఐటీల్లో ఆ ఫ్లావర్
కొరవడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే ఎంటెక్ కోర్సులకు, పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్లు చేసిన నాలుగైదు నెలల తర్వాత అభ్యర్ధులు గేట్ పరీక్ష రాసి అర్హత సాధించి ఆ ర్యాంకు ఆధారంగా నవరత్నాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు, దాంతో ఆ సీట్లను భర్తీ చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఆ సీట్లను ఖాళీగా ఉంచలేక, భర్తీ చేయలేక ఐఐటీలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఇబ్బందిని కూడా తప్పించుకునేందుకు రానున్న రోజుల్లో ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్లకు నూతన ఒరవడి అనుసరించాలని ఐఐటీ కౌన్సిల్ భావించింది. ఈ అంశాలు అన్నింటినీ అధ్యయనం చేసేందుకు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ భాస్కర రామమూర్తి ధ్యక్షతన కమిటీని వేశారు. ఈ కమిటీలో ఐఐటీ కాన్మూర్ డైరెక్టర్ అభయ్ కర్‌ణ్‌ధికర్, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి, ఐఐటీ ముంబై ప్రొఫెసర్ కన్నన్ వౌద్గల్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మంగళవారం కూడా సమావేశమై పలు అంశాలను అధ్యయనం చేస్తుంది, అనంతరం నిర్ణయాలను వెల్లడిస్తారు. ఐఐటీల నిర్వహణకు సంబంధించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయమే తుదకు అమలుచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐఐటీల్లో అమ్మాయిల కోటాను 8 శాతం నుండి 14 శాతానికి పెంచాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది దీనిని 14 శాతం నుండి 17 శాతానికి పెంచుతారు. 22-21 మరో 3 శాతం పెంచుతారు. దీంతో ఐఐటీల్లో గణనీయంగా అమ్మాయిలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది.