రాష్ట్రీయం

మహిళా సంఘాలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికంగా బలంగా మారాలన్న ఉద్దేశంతో ఈ సంఘాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి 902 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం
తన వాటాగా 339 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, ఈ నిధులకోసం కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నామన్నారు.
మహిళా సంఘాలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,74,046 మహిళా సంఘాలకు సుమారు 7,900 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు, స్ర్తినిధి ద్వారా అందించామని జూపల్లి తెలిపారు. 2018-19 సంవత్సరంలో అర్హత కలిగిన 3,23,770 మహిళా సంఘాలకు 8,800 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయించి, ఇప్పటివరకు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చామని వివరించారు.
భారీగా వానలు కురుస్తున్నందు వల్ల గ్రామాల్లో పారిశుద్దిపనులు సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని మంత్రి జూపల్లి తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు జాగ్రత్తగా విధి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు ఈఓ (పంచాయతీరాజ్), ఎంపీడీఓలు, డీపీఓలు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించామన్నారు. అవసరమైతే పారిశుద్ధ్యపనులకోసం దినసరి కూలీలను నియమించుకునే అవకాశం కల్పించామన్నారు.
గ్రామ పంచాయతీల్లో వౌలిక వసతులు ఇతర అవసరాలకోసం 2018-19 బడ్జెట్‌లో 1200 కోట్ల రూపాయలను కేటాయించామని జూపల్లి అన్నారు. హరితహారం సజావుగా సాగేందుకు ప్రతి గ్రామంలో నర్సరీలను సెప్టెంబర్ 30 లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనంగా నెలకు 8,500 రూపాయలు నిర్ణయించామని, ఈ వేతనాన్ని కార్మికుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేస్తామన్నారు. ప్రతి 500 జనాభాకు ఒక పారిశుద్ద్య కార్మికుడు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
జోనల్ విధానం..
కార్యదర్శుల నియామకం
జోనల్ విధానంపై తమ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన నివేదికకు అనుగుణంగా అనుమతి రాగానే గ్రామ పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని చేపడతామని మంత్రి జూపల్లి తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు నియామకంలో స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని, జోనల్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తున్నామని గుర్తు చేశారు. పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 90 శాతం మంది ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేశామని, మిగతావారి సర్వీసులను కూడా త్వరలో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు.
కేరళ వరద బాధితులకోసం తాను తన నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించానని తెలిపారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి