రాష్ట్రీయం

కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: ‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబాన్ని తరిమి కొట్టండి..’ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం అన్ని జిల్లాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పార్టీ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానలిచ్చారు. నలుగురి సుఖం కోసం రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలను హింసిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజానికి ప్రమాదం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టే డబ్బుతో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని వ్యాఖ్యానించారు. గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రతో
ఆపేశారని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తామన్నారు. పెన్షన్ వయోపరిమితిని 58 ఏళ్ళకు తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులతూ పెన్షన్‌లు ఇస్తామని, అర్హులైతే భార్యాభర్తలిద్దరికీ పెన్షన్‌ను వర్తింప చేస్తామన్నారు. వృద్ధాప్య, గీత కార్మికుల పెన్షన్లు, యువతకు, నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.
రైతులకు ప్రతి పంటకూ మద్దతు ధర అందించడమే కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని ఉత్తమ్ అన్నారు. రెండు లక్షల రూపాయల రుణ మాఫీనీ ఏకకాలంలో చేస్తామని పునరుద్ఘాటించారు. రైతులకు బీమా ఉండాల్సిందే కానీ రైతులు బతికి ఉన్నప్పుడే మేలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రజలనే కాదు దేవుళ్ళనూ మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాలుగున్నర ఏళ్ళలో ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. ఇప్పుడు తాము చేస్తున్న వాగ్దానాలను అధికారంలోకి రాగానే అమలు చేసి చూపిస్తామన్నారు. తమపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారంతో విమర్శలకు పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రచార ఆర్భాటం తప్ప పాలన లేదని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపునిస్తామని ఉత్తమ్ అన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం జరిగిన రాజీవ్ గాంధీ జయంతి సభలో పాల్గొన్న
షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్, జానారెడ్డి తదితరులు